Asianet News Telugu

కొంప ముంచిన ప్లాస్టిక్ సర్జరీ.. హీరోయిన్ అందం నాశనం!

సహజ సౌందర్యాన్ని కాదని కృత్రిమ సౌందర్యం కోసం ప్రయత్నించి భంగపడ్డ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ప్లాస్టిక్ సర్జరీలతో అందం పెరుగుతుందనే గ్యారెంటీ లేదు. అయినా కూడా ప్రయత్నించి మునుపటికంటే దారుణంగా తయారైన నటులు ఎందరో ఉన్నారు. 

Mouni Roy trolled for her multiple plastic surgeries
Author
Hyderabad, First Published Jun 6, 2019, 3:18 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సహజ సౌందర్యాన్ని కాదని కృత్రిమ సౌందర్యం కోసం ప్రయత్నించి భంగపడ్డ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ప్లాస్టిక్ సర్జరీలతో అందం పెరుగుతుందనే గ్యారెంటీ లేదు. అయినా కూడా ప్రయత్నించి మునుపటికంటే దారుణంగా తయారైన నటులు ఎందరో ఉన్నారు. బాలీవుడ్ నటి మౌనిరాయ్ బుల్లితెర క్వీన్ గా ఓ వెలుగు వెలిగింది. బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. అదృష్టం కలసి రాక స్టార్ హీరోయిన్ కాలేదు అంతే. స్టార్ హీరోయిన్లకు పోటీనిచ్చే సౌందర్యం మౌనిరాయ్ సొంతం. 

ఇటీవల మౌనిరాయ్ తన అందాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ బాట పట్టింది. పలు సర్జరీల అనంతరం ఇటీవల ఓ ఈవెంట్ లో మౌనిరాయ్ మెరిసింది. ఆమెని చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎలా ఉండే హీరోయిన్ ఎలా అయిపోయింది అంటూ నోరెళ్లబెడుతున్నారు. 

సహజ సౌందర్యంతో గతంలో ఏంజల్ లా కనిపించిన మౌనిరాయ్ ముఖంలో మెరుపు ప్లాస్టిక్ సర్జరీ కారణంగా నాశనమైందని నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మీ పెదవులకు ఏమైంది.. ప్లాస్టిక్ సర్జరీ వికటించిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన సహజ అందంపై నమ్మకం లేకనే మౌనిరాయ్ ఇలా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందని, ప్రస్తుతం ఆమె రాఖి సావంత్ లా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios