పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ఫ్యాన్స్ ని మాత్రం ఏళ్ల తరబడి వైట్ చేయిస్తున్నాడు. ఒకప్పుడు ఏడాదికి కనీసం రెండు సినిమాలు ప్రభాస్ చేసేవాడు. బాహుబలి తరువాత ఆయన రెండేళ్లకు ఓ మూవీ చేస్తున్నారు. బాహుబలి 2 విడుదలైన రెండేళ్లకు సాహో విడుదల కావడం జరిగింది. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన నటిస్తున్న చిత్రాల అప్డేట్స్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

రాధే శ్యామ్ షూటింగ్ మొదలై రెండేళ్లకు దాటిపోతుంది. అయినా ఆ మూవీ షూటింగ్ 50శాతం కూడా పూర్తి కాలేదు. ఆ మధ్య రాధే శ్యామ్ నుండి అప్డేట్ కావాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేశారు. దీనితో రాధే శ్యామ్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇక పూజ హెగ్డే పుట్టినరోజు సంధర్భంగా ఆమె లుక్ విడుదల చేయడం జరిగింది. 

అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కాగా ఆరోజు ప్రభాస్ తమ కోసం ఏమి గిఫ్ట్స్  సిద్ధం చేస్తున్నారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ఆత్రుతకు తెరదించుతూ రాధే శ్యామ్ మూవీ నుండి మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేశారు. నిజానికి ఫ్యాన్స్ ఈ చిత్రం నుండి టీజర్ ఆశించారు. షూటింగ్ సగ భాగం కూడా పూర్తి కాకపోవడంతో పాటు విడుదలకు చాలా సమయం ఉంది. అందుకే మోషన్ పోస్టర్ తో సరిపెట్టారు. 

ప్రభాస్ మరో రెండు చిత్రాలు లైన్ లో పెట్టారు, దర్శకుడు నాగ్ అశ్విన్ తో భారీ బడ్జెట్ మూవీతో పాటు, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ అనే పౌరాణిక చిత్రం ప్రకటించారు. ఈ రెండు చిత్రాల నుండి కూడా కీలక అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తుంది.