ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు... అఖిల్ సినిమాకు కొత్త చిక్కులు వచ్చాయని, దాంతో స్టోరీలో మార్పులు చేయాల్సిన పరిస్దితి వచ్చిందంటున్నారు. అదేమిటంటే... మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఆర్ కె నాయుడు (సాగర్ ) షాదీ ముబారక్ అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు రిలీజ్ చేస్తున్న ఈ సినిమా కథ అఖిల్ సినిమా కథ ఒకే లా ఉందని సమాచారం. దాంతో అఖిల్ సినిమాలో మార్పులు చేస్తున్నారని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది. 

 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సెకండ్ ఆఫ్ లో చాలా వరకు మార్పులు చేస్తున్నాడట దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. మార్పులు చేసి కొత్తగా స్క్రిప్ట్ రాసి రీషూట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ , ఒక పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకో షెడ్యూల్‌ చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ నెలాఖరుతో పూర్తయ్యే ఆ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు.

మొదట సంక్రాంతికే ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవి లక్ష్యంగా ముస్తాబవుతోంది. యువతరానికి నచ్చే అంశాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బ్యాచ్‌లర్‌గా అఖిల్‌ చేసే సందడి ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఛాయాగ్రహణం: ప్రదీశ్‌ ఎమ్‌.వర్మ. 

‘పరుగు’, ‘బొమ్మరిల్లు’ చిత్రాలతో సంచలనాలు సృష్టించిన భాస్కర్‌కు గత కొద్ది కాలంగా హిట్‌ లేదు. మరోవైపు అఖిల్‌ కూడా సరైన హిట్‌ కోసం వేచి చూస్తున్నారు. మరి ఇద్దరూ ఎలా అలరిస్తారో చూడాలి.