Asianet News TeluguAsianet News Telugu

భాక్సాఫీస్: ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ కు ఎంత లాభం?

బాక్సాఫీస్ దగ్గర అయ్యగారు బాగానే వసూలు చేసారు. ఆరేళ్ల కెరీర్‌లో తొలిసారి విజయం రుచి ఎలా ఉంటుందో చూసాడు అఖిల్. బన్నీవాసు, వాసు వర్మ నిర్మించారు. 

Most Eligible Bachelor 16 Days Collections
Author
Hyderabad, First Published Nov 1, 2021, 9:45 AM IST


  దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ . చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ఈ సినిమా ఊరట ఇచ్చినట్లు అయ్యింది.  ఈ సినిమాతో పోటీగా విడుదలైన మహా సముద్రం, పెళ్లి సందడి సినిమాలు పోటీ ఇవ్వకపోవడంతో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కుమ్మేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర అయ్యగారు బాగానే వసూలు చేసారు. ఆరేళ్ల కెరీర్‌లో తొలిసారి విజయం రుచి ఎలా ఉంటుందో చూసాడు అఖిల్. బన్నీవాసు, వాసు వర్మ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. చాలా కాలం తర్వాత అఖిల్ సినిమాకు చెప్పుకునే స్దాయిలో కలెక్షన్స్ కనపడుతున్నాయి. 

మొదటి రెండు రోజుల్లోనే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చాలా చోట్ల అదిరిపోయే కలెక్షన్స్ సాధించటం ప్లస్ అయ్యింది. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తీసుకుని.. కన్ఫ్యూజ్ అయినా కూడా ఫన్ తో మెప్పించాడు బొమ్మరిల్లు భాస్కర్. మరి ఈ సినిమా వరల్డ్ వైడ్ 16 రోజుల్లో  వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 23.42 కోట్లు షేర్ (39.30 కోట్ల గ్రాస్) వచ్చిందని సమాచారం.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాకు 19.71 కోట్ల బిజినెస్ జరిగింది. 16 రోజుల్లోనే ఈ చిత్రం 23.42 కోట్లకు పైగా షేర్ వసూలు చేయటంతో  అన్నిచోట్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వచ్చేసారు. మొత్తంగా రూ. 4.5 కోట్ల లాభాలు తీసుకొచ్చారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అంటున్నారు.  ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే కొన్నవారికి బాగా వర్కవుట్ అయ్యిందని అంటున్నారు.  తెలంగాణ (నైజాం)లో మల్టిఫ్లెక్స్ లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. దసరా వెళ్లిన ఇన్ని రోజుల తర్వాత కూడా కలెక్షన్స్ బాగానే వస్తుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం అఖిల్ తో సినిమా చేస్తున్న నిర్మాతలకు ఈ సినిమా ఊపునిచ్చింది.   
 
బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ... ‘‘ప్రతి పెళ్లి వేడుకలా జరుగుతుంది. అయితే పెళ్లి తర్వాత ఎలా బతకాలి అన్న విషయంలో ఎవరికీ స్పష్టత ఉండదు. అసలు వివాహం తర్వాత కాపురం సాఫీగా సాగడానికి కావాల్సిన  అర్హతలేంటి? అన్నది మనకు తెలియదు. ఈ అంశాన్ని ఓ ఆసక్తికర కథనంగా చెప్పాలి.. అదీ సున్నితమైన వినోదంతో ఆకట్టుకునేలా చూపించాలి అన్న ఉద్దేశంతో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చేశాం. మనలో ఉన్న ఓ ఎమోషన్‌ని మనసులో ఉన్న ఓ వ్యక్తికి చెప్పాలనుకున్నప్పుడు.. ఆ టైమ్‌కి వాళ్లు రాకపోతే కలిగే బాధని వర్ణించలేము. ఆ బాధ ఎలా ఉంటుందనేది దీంట్లో ఆసక్తికరంగా చూపించాం. దీనికి అఖిల్‌, పూజా హెగ్డే తమదైన నటనతో ప్రాణం పోశారు’’ అన్నారు.

 
 

Follow Us:
Download App:
  • android
  • ios