త్వరలో మోసగాళ్లు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మంచు విష్ణు. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ‘మోస‌గాళ్లు’ సినిమాలో మంచు విష్ణు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్ శెట్టి, న‌వ‌దీప్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

పబ్లిసిటీలో కొత్తదనం చూపించకపోతే ఎవరూ పట్టించుకోవటం లేదు. జనాల్లో క్యూరియాసిటీ కలిగించి, ఓపినింగ్స్ రాబడితే అప్పుడు హిట్టో,ఫ్లాఫ్ తెలుస్తుంది. ఈ విషయం గమనించిన కొత్తదనం సినిమా రిలీజ్ కు ముందు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా మంచు విష్ణు కొత్త చిత్రం మోసగాళ్లు కు కూడా అదే తరహా ప్రచారానికి తెర తీసారు. కాజల్ కీలక పాత్రధారిగా రూపొందిన... ఈ సినిమాని పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేసేందుకు విష్ణు సన్నాహాల్లో ఉన్నారు. హాలీవుడ్ నుంచి జెఫ్రీ చిన్ అనే ద‌ర్శ‌కుడిని తీసుకొచ్చి మంచి బ‌డ్జెట్ పెట్టి.. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో తీర్చిదిద్దిన థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఈ మ‌ధ్యే రిలీజ్ చేసిన ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా, ఇంట్రస్టింగ్ గా అనిపించింది.

ఈ నెల 19నే మోస‌గాళ్ళు ప్రేక్ష‌కుల మందుకు రాబోతోంది.దాంతో వారి దృష్టిని ఆకట్టుకునేందుకు కాను... కొంచెం అగ్రెసివ్‌గా ప్ర‌మోట్ చేయాల‌ని ఈ చిత్రానికి నిర్మాత కూడా అయిన మంచు విష్ణు డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా ఆయనో సాహ‌సం చేశాడు. సినిమాలో ప‌ది నిమిషాల కీల‌క ఎపిసోడ్‌ను మీడియా వాళ్ల‌కు చూపించాడు. వాళ్ల‌కు ఆ ఎపిసోడ్ బాగానే న‌చ్చింద‌ని చెప్తున్నారు. ఆ పది నిముషాలు సినిమా ప‌ట్ల ఆస‌క్తిని పెంచేలా ఆ స్నీక్ పీక్ ఉంద‌ని చెప్తున్నారు.

గతంలో బేతాళుడు అనే సినిమా నుంచి తొలి పది నిమిషాల క్లిప్ రిలీజ్ చేసి ఆస‌క్తి రేకెత్తించారు. అయితే అది సామాన్య జనాలకు. అయితే మంచు విష్ణు మాత్రం సామాన్య జ‌నానికి కాకుండా మీడియా వాళ్ల‌కు ప‌ది నిమిషాల ఎపిసోడ్ చూపించి వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. వాళ్లకి నచ్చితే వాళ్లే ప్రమోట్ చేస్తారు కదా అని ఆయన ఆలోచన. మీడియా వాళ్లందరూ పాజిటివ్‌గా స్పందించ‌డంతో అత‌ను కాన్ఫిడెంట్‌గా సినిమాను రిలీజ్ చేయ‌డానికి రెడీ చేయబోతున్నారట. అయితే మీడియా వాళ్లు మాత్రం..బాగోలేకపోతే బాగోలేదు అని చెప్తారా...సైలెంట్ గా వచ్చేస్తారు అని కొందరు సైటైర్స్ వేస్తున్నారు. అలాంటివన్నీ కామనే కాబట్టి పట్టించుకోవాల్సిన పనిలేదు. 

మంచు విష్ణు మాట్లాడుతూ..‘‘అతిపెద్ద ఐటీ స్కామ్‌ ఆధా రంగా ‘మోసగాళ్ళు’ చిత్రాన్ని రూపొందించాం. ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. మా నాన్న (మంచు మోహన్‌బాబు) పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 19న సినిమాను విడుదల చేస్తున్నాం. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని మంచు విష్ణు అన్నారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి, నవదీప్, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషించారు.