పవన్ తల్లి ఫోటోలను అసభ్యకరంగా చిత్రీకరించారు!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 28, Aug 2018, 1:00 PM IST
Morphed photos of pawan kalayan's mother posted
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో అతడికి ప్రత్యర్థులైన కొందరు అతడిపై కామెంట్లు చేయడంతో పాటు అతడి కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో అతడికి ప్రత్యర్థులైన కొందరు అతడిపై కామెంట్లు చేయడంతో పాటు అతడి కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా అతడి తల్లి ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర రీతిలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'చంటిఅబ్బాయి' అనే ట్విట్టర్ అకౌంట్ నుండి మార్ఫింగ్ చేసిన ఫోటోలను పోస్ట్ చేసినట్లు తెలిసింది. శ్రవణ్ అనే వ్యక్తికి ఈ ఫోటోలు తారసపడడంతో వెంటనే అతడు హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. పోలీసులు కంప్లైంట్ ప్రకారం ఈ కేసుని సైబర్ క్రైమ్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు.

ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీ అడ్రెస్ తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కంప్లైంట్ చేసిన వ్యక్తి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే .. దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ చర్యపై పవన్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు . ఇలాంటి పనులకు పాల్పడుతున్న వారిని శిక్షించాలంటూ కోరారు. 

ఇది కూడా చదవండి.. 

పవన్ బర్త్ డే కి చరణ్ స్పెషల్ గిఫ్ట్!

loader