పవన్ బర్త్ డే కి చరణ్ స్పెషల్ గిఫ్ట్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 28, Aug 2018, 12:39 PM IST
Ram Charan Movie First Look On Pawan Kalyan Birthday
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్2) సందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ కోసం ఓ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇంతకీ ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే.. ప్రస్తుతం రామ్ చరణ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్2) సందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ కోసం ఓ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇంతకీ ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే.. ప్రస్తుతం రామ్ చరణ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కానీ, టైటిల్ కానీ రిలీజ్ కాలేదు.

షూటింగ్ మొదలై చాలా కాలం అవుతుండడంతో ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. అది కూడా తన బాబాయ్ పవన్ పుట్టినరోజు నాడు విడుదల చేయాలని చరణ్ చిత్రబృందానికి సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ ఫస్ట్ లుక్ పోస్టర్ పవన్ పుట్టినరోజు నాడు రావడం ఖాయమని అంటున్నారు.

ఇటీవల చిరు పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన టీజర్ కూడా ముందుగా పవన్ కళ్యాణ్ కి చూపించినట్లు రామ్ చరణ్ వెల్లడించాడు. తన సినిమా ఫస్ట్ లుక్ కూడా బాబాయ్ ఓకే చేసిన తరువాతే రిలీజ్ చేస్తాడేమో చూడాలి!

loader