'కాలా'కు కొత్త తలనొప్పి: ఓ పక్క కర్ణాటక సీఎం.. మరోవైపు నాడార్ సంఘం

First Published 6, Jun 2018, 10:42 AM IST
More trouble for Rajinikanth's Kaala
Highlights

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కాలా' సినిమా విడుదలకు అడుగడుగునా అడ్డంకులే 

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కాలా' సినిమా విడుదలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ సినిమాను విడుదల చేయకూడదు అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. కావేరీ జల వివాదంపై రజినీకాంత్ చేసిన వ్యాఖ్యల కారణంగా సినిమాను కన్నడ నాట విడుదలకు అక్కడ సంఘాలు అభ్యంతరం పెట్టాయి. కానీ కర్ణాటక హైకోర్టు ఈ విషయంలో కల్పించుకొని సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

థియేటర్ల వద్ద భద్రత కల్పించమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం దీనికి అంగీకరించడం లేదు. జల వివాదానికి సంబంధించిన ఇష్యూ తేలేవరకు రజినీకాంత్ సినిమా కన్నడలో విడుదల కానివ్వమంటూ లేటెస్ట్ గా ఓ కామెంట్ చేశాడు. ఇప్పుడు కర్ణాటకలోనే కాదు తమిళనాడులో కూడా ఈ సినిమా విడుదల పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

నాడార్ కులానికి చెందిన ఓ సంఘం ఈ సినిమా విడుదల కాకూడదని కోర్టులో పిటిషన్ వేసింది. పూణేలో స్థిరపడ్డ నాడార్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారని అక్కడ ఆయన రౌడీయిజం చేసినట్లు ఈ సినిమాలో చూపించారని వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ సినిమాను రూపొందించినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణ నేడు జరగనుంది. 

loader