హిందీ టీవీ నటుడు కరణ్‌ మెహ్రాపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య అకౌంట్‌ నుంచి మనీ విత్ డ్రా చేసినందుకుగానూ ఆయనపై కేసు ఫైల్‌ చేశారు. 

హిందీ టీవీ నటుడు కరణ్‌ మెహ్రాపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య అకౌంట్‌ నుంచి మనీ విత్ డ్రా చేసినందుకుగానూ ఆయనపై కేసు ఫైల్‌ చేశారు. అయితే కరణ్‌ మెహ్రా డ్రా చేసింది వేలు, లక్షలు కాదు, ఏకంగా కోటి రూపాయలు. తనకు తెలియకుండా తన అకౌంట్‌ నుంచి కోటీ రూపాయలు విత్‌ డ్రా చేశారని తెలుసుకున్న భార్య నిషా రావల్‌.. శుక్రవారం గోరేగావ్‌ పోలీస్‌ స్టేషన్‌లో భర్త కరణ్‌పై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

ఈ కేసుకు సంబంధించి టీవీ నటుడు కరణ్‌తోపాటు అతని ఇద్దరు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. భర్తకి వ్యతిరేకంగా నిషా పోలీసులను సంప్రదించడం ఇది రెండో సారి. అంతకంటే ముందు మే 31న మెహ్రా తన భార్యపై దాడి చేసినందుకు గోరేగావ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతనికి బెయిల్‌ లభించింది. ఇప్పుడు మరోసారి అతనిపై కేసు నమోదు చేయడం గమనార్హం. వీరికి ఎనిమిదేళ్ల క్రితం మ్యారేజ్‌ జరిగింది. వీరికో కుమారుడు కూడా ఉన్నారు. 

వీరిద్దరి చాలా కాలంగా మనస్పర్థాలు తలెత్తాయని వార్తలు వినిపించాయి. నిషా ప్రవర్తన సరిగా లేదని, చాలా దూకుడుగా వ్యవహిస్తుంటుందని కరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తనకు కోపం వచ్చిన్పప్పుడు అందరిపై దాడి చేస్తుందని, ఇంట్లోని వస్తువులను పగలగొడుతుందన్నారు. తన భార్య చేష్టలతో ఓ సారి తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు పేర్కొన్నాడు.