ప్రముఖ టీవీ నటి మోనాలీసా.. టీవీ షో కోసం షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె గాయపడ్డారు. వెంటనే ఆమెని దగ్గరలోకి ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. 'ఖాత్ర ఖాత్ర ఖాత్ర' అనే రియాలిటీ షోలో పాల్గొంది మోనాలీసా. ఇందులో భాగంగా ఆమె కొన్ని స్టంట్స్ చేయాల్సి వచ్చింది.

ఈ క్రమంలో ఆమె ఓ స్టంట్ చేస్తోన్న సమయంలో ప్రమాదవశాత్తు గాయపడింది. వెంటనే ఆమెని దగ్గరలోకి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఈ షోలో మోనాలీసాతో పాటు భారతీ సింగ్, హర్ష్ లిమ్బాచియా, రీమ్ షేక్, ఆదిత్య నారాయణ్, రిదిమా పండిట్ లు పాల్గొన్నారు.

మోనాలీసా భోజ్ పూరి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే మంచి పాపులారిటీ దక్కించుకుంది. భోజ్ పూరిలో స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. ప్రస్తుతం ఈమె 'నజర్' అనే టీవీ సీరియల్ లో నటిస్తోంది.

ఈ సీరియల్ లో ఆమె మోహన అనే పిశాచి పాత్రలో నటిస్తోంది. ఈమె పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వస్తోంది. బిగ్ బాస్ సీజన్ 10లో కంటెస్టంట్ గా పాల్గొని క్రేజ్ తెచ్చుకుంది.