`ఏడవకు.. ఏడిస్తే లాభం లేదు. మనం సేవ్‌ అవ్వము` అని అవినాష్‌ అంటే.. `అఖిల్‌ పాజిటివ్‌ పర్సన్‌.. ఆయనకు ఏమైందో ఏమో `అని మోనాల్‌ అంటుంది.. `మా నాన్నకు నువ్వు నచ్చావు.. ఏందో ఏమో` అని అభిజిత్‌ అంటున్నాడు. `ఆ మనిషి కొంచెం కూడా స్పందించడ`ని అఖిల్‌ అంటున్నాడు. తాజా ప్రోమో ఆసక్తికరంగా సాగుతుంది 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లోని 12వ వారానికి సోమవారం నామినేషన్లు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో అవినాష్‌, అఖిల్‌, అరియానా, మోనాల్‌ నామినేట్‌ అయ్యారు. అయితే ఈ నామినేషన్‌కి సంబంధించిన ఫ్రస్టేషన్‌ని వెల్లగక్కుతున్నారు ఇంటిసభ్యులు. ముఖ్యంగా అవినాష్‌, అఖిల్‌ చాలా ఫీల్‌ అవుతున్నారు. అరియానా నామినేషన్‌ అయినందుకు ఏడుస్తుంటే అవినాష్‌ తన ఫ్రస్టేషన్‌ని వెల్లడించారు. గేమ్‌ చూసి నామినేషన్‌ జరగడం లేదని చెప్పాడు. ఇక కష్టపడి టాస్క్ లు ఆడాల్సిన అవసరం లేదని మండిపడ్డాడు. 

మోనాల్‌ ఇలా చేయడంపై అఖిల్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఓరకంగా అఖిల్‌కి మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందని చెప్పొచ్చు. సోహైల్‌ వద్త తన గోడుని వెల్లగక్కుతున్నాడు. మరోవైపు అఖిల్‌, మోనాల్‌ లవ్‌ స్టోరీ ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకుంది. మళ్ళీ మొదటి రోజులను తలపిస్తుంది. మరోసారి పులిహోర కలిపే బాధ్యత అభిజిత్‌ తీసుకున్నాడనిపిస్తుంది. 

మోనాల్‌తో ఒంటరిగా మాట్లాడుతూ, `అసలు మా నాన్నకు నువ్వు నచ్చావు.. ఏందో ఏమో.. `అన్నాడు. దీంతో అభిజిత్‌ వైపు మోనాల్‌ అదొలా చూసింది. ఆయనపై ప్రేమని మరోసారి ఒలకబోస్తున్న ఫీలింగ్‌ కలిగింది. మోనాల్‌ లవ్‌ స్టోరీ మరో టర్న్ తీసుకుంది. మళ్ళీ వీరిద్దరి మధ్య లవ్‌ స్టోరీ ప్రారంభమవుతుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.