బిగ్ బాస్ హౌస్ నిన్న అంతా సీరియస్ గా సాగింది. నామినేషన్స్ ప్రక్రియ ఇంటి సభ్యుల మధ్య గొడవలకు కారణం అయ్యింది. రాజశేఖర్-అఖిల్, ఆరియానా-మెహబూబ్ మధ్య వాగ్వాదం నడిచింది. ఎక్కువ మంది చేత నామినేట్ కాబడిన ఇంటి సభ్యులు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. అఖిల్, మోనాల్, ఆరియానా, లాస్య, అమ్మ రాజశేఖర్ మరియు మెహబూబ్ ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. 

నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఇంటి సభ్యులు కొంచెం రిలాక్స్ అయ్యారు. అందరూ నార్మల్ మూడ్ లోకి రావడం జరిగింది. కాగా గార్డెన్ ఏరియాలో అఖిల్, మోనాల్ కూర్చొని ఉండగా...కొంచెం దూరంలో అవినాష్, ఆరియానా కూర్చొని ఉన్నారు. మోనాల్ ని చూసి అవినాష్ ''నువ్వు మారిపోయావు ఛీ ఛీ' అని అన్నాడు. 

దానితో మోనాల్ పరుగెత్తుకుంటూ వెళ్లి అవినాష్ నుదిటిపై ముద్దు పెట్టింది. దూరం నుండి ఇదంతా అఖిల్ గమనిస్తున్నాడు. దానికి అవినాష్ చాలా ఎక్సయిట్ అయ్యాడు. నా పొలంలో మొలకలు వచ్చాయ్ అని పెద్దగా అరిచాడు. మోనాల్ దృష్టిలో 'ఏ' అంటే అవినాష్ అని అన్నాడు. దానికి అఖిల్... అంతేనా అని నిట్టూర్చాడు. మోనాల్ తనను కిస్ చేసిందని అఖిల్ గొప్పగా చెప్పుకున్నాడు. ఈ సీన్ లో ఆరియానా కూడా ఉండడం విశేషం.