బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పటి నుండి మరొక ఎత్తు. ఫైనల్ స్టేజికి షో చేరుకోగా గెలుపుకోసం ఇంటి సభ్యులు చెమటోడావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ లో ఒకరు నేరుగా ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉందని బిగ్ బాస్ ప్రకటించారు. బిగ్ బాస్ నిర్వహించిన దశల వారీ టాస్క్ లలో గెలిచిన నిలిచిన ఒక సభ్యుడు, ఫినాలే మెడల్ గెలుచుకొని ఫైనల్ కి వెళ్లొచ్చని చెప్పాడు. 

ఫినాలే మెడల్ కోసం మొదటి టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి ఆవరణలో ఉంచిన ఆవు బొమ్మ నుండి పాలు సేకరించాలని కోరాడు. నిర్ధిష్ట సమయంలో ఎక్కువ పాలు సేకరించిన నలుగురు నెక్స్ట్ లెవెల్ కి వెళతారని అన్నారు. ఈ టాస్క్ లో పాల కోసం ఇంటి సభ్యులు యుద్దానికి దిగారు. ఒకరినొకరు పాల కోసం పోట్లాడుకోవడం, తోసుకోవడం చేశారు. పాల కోసం పోటీపడే సమయంలో మోనాల్, అభిజిత్ ని కాలితో తన్నింది. 

కాలితో తన్నిన మోనాల్ పై అభిజిత్ కోప్పడ్డారు. మోనాల్ కి సపోర్ట్ గా అఖిల్, సోహైల్ రావడంతో అవినాష్ మరింత ఆవేశానికి గురయ్యాడు. కాలితో తన్నినా తనని ఏమి అనకుండా, తనని టార్గెట్ చేయడంతో అవినాష్ బాధపడ్డాడు. అందరూ తనను టార్గెట్ చేసి గేమ్ నుండి అవుట్ చేశారని అవినాష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తంగా ఈ టాస్క్ లో అత్యధిక పాలు సేకరించి హారిక, అభిజిత్, అఖిల్ మరియు సోహైల్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లారు. 

సేకరించిన పాలలో నీళ్లు కలిపిన అవినాష్ తో పాటు తక్కువ పాలు సేకరించిన అరియానా మరియు మోనాల్ కూడా టాస్క్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఫినాలే మెడల్ కోసం గెలిచిన నగలుగురు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లారు. రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారిపోనుంది.