బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ లిస్ట్ విషయంలో ప్రేక్షకులు ఒకింత నిరాశకు గురయ్యారు. ఇంటి సభ్యులుగా ఎంపికైన వారిలో సగానికి పైగా ఎవరికీ తెలియని, ఎటువంటి ఫేమ్ లేని వ్యక్తులు ఉన్నారు. కొంచెం తెలిసిన మొహాలలో సుడిగాడు మూవీలో హీరోయిన్ గా నటించిన మోనాల్ గజ్జర్ ఒకరు. ఈ నార్త్ ఇండియన్ బేబీ తన గ్లామర్ తో ప్రేక్షకులకు సరదా పంచుతుందని అందరూ భావించారు. 

ఐతే దానికి భిన్నంగా మోనాల్ ప్రతిసారి ఏడుస్తూ ప్రేక్షకులను విసిగించేస్తుంది. మొదటిరోజు నుండి మోనాల్ తీరు ఇలానే ఉంది. నిన్న బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా తన సొంత ఊరు,ఇల్లు, చనిపోయిన తన బంధువులను తలచుకొని ఏడ్చేసింది.తనకు దూరమైన తండ్రి, బంధువులను తలచుకొని ఏడ్చిందంటే ఒక అర్థం ఉంది, కానీ నేడు ఆమె ఎందుకు అంత ఘనంగా ఏడుస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. 

వంట విషయంలో సరదా కోసం అమ్మ రాజశేఖర్ రెండు మాటలు అన్నాడు. దానికి కూడా మోనాల్ భయంకరంగా ఏడ్చేశారు. ఇక తనకు భాష ప్రాబ్లం ఉందని, దాని వలన కొందరు తనను ఇబ్బంది పెడుతున్నట్లుగా భావించి మోనాల్ కన్నీరు పెట్టుకున్నారు. ఆమెను ఓదార్చడానికి సుజాత, కరాటే కళ్యాణి రంగంలోకి దిగారు. మరి నిజంగా మోనాల్ ఏడ్చేస్తున్నారా లేక సింపథీ కోసం ట్రై చేస్తున్నారో అర్థం కాలేదు. అర్థంపర్థం లేకుండా ప్రతి చిన్న విషయానికి ఏడిస్తే సింపథి మాట అటుంచితే విసుగొచ్చి ప్రేక్షకులు పంపేయడం ఖాయం.