బెస్ట్ రూలర్‌గా అరియానా కొట్టేసినప్పుడు కూడా తనకు ఇలానే జరుగుతుందని, తాను బాగా ఆడానని, తనలో ఏదో జరుగుతుందని, ఒక్కతే బిగ్‌బాస్‌కి చెప్పుకుంది. మోనాల్ ప్రవర్తన మంగళవారం ఎపిసోడ్‌లో అనేక సందేహాలకు తావిస్తోంది.
బిగ్‌బాస్ నాల్గో సీజన్ మంగళవారం, 93వ ఎపిసోడ్‌లో మంగళవారం రాణిగా మారిన మోనాల్ విచిత్రంగా ప్రవర్తించింది. తాను రాణిగా ఉంటూ అభిజిత్, సోహైల్ మధ్య లవ్ ప్రపోజల్ టాస్క్ ఇచ్చింది. ఆ సమయంలో అఖిల్‌ని తన గురించి చెప్పమని అడిగింది మోనాల్. హ్యాపీనెస్‌లో తొందరగా నిర్ణయాలు తీసుకుంటావని అఖిల్ చెప్పాడు. మిగిలిన ఏ సందర్భంలోనైనా కూల్‌గా ఉంటావని చెప్పాడు. మార్చుకోవాల్సినవి చెప్పాడు అఖిల్. ఆ తర్వాత తన అధికారంలో అభిజిత్ అమ్మాయిలా, సోహైల్ అబ్బాయిలా, లవర్‌ని పార్టీకి పిలిచే టాస్క్ ఇచ్చాడు.
ఈ ఎపిసోడ్ ఆద్యంతం నవ్వులు పూయించింది. ఒకానొక దశలో అరియానా, హారిక కొట్టుకునే సిచ్వేషన్ వచ్చింది. అయితే చివర్లో అఖిల్, హారిక చర్చించుకున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ చేశానా అని మోనాల్.. అఖిల్‌ని అడిగింది. దీని తర్వాత అఖిల్ వద్ద నుంచి వెళ్ళిపోతూ తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ ఇచ్చింది. గట్టిగా వాటేసుకుంది. ఇది వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎంత దూరం వెళ్ళిందో అనే సందేహాలను కలిగిస్తుంది.
ఇక ఓపిక టాస్క్ లో మోనాల్‌కి చుక్కలు చూపించింది అరియానా. తనపై పాత కక్ష్యాలు సాధించుకుందని, తనపై ఇంత కోపం పెట్టుకుని ఎందుకు మాట్లాడావు అని, ఇన్నాళ్ళు నటించావా? అని అరియానా ప్రశ్నించింది. మొత్తంగా మోనాల్ బండారాన్ని బయటపెట్టింది. ఓపిక టాస్క్ లో పది సార్లు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చినట్టు అఖిల్ పేర్కొన్నాడు. ఈ టాస్క్ పూర్తయిన తర్వాత లోపలికి వెళ్లి ఎక్కి ఎక్కి ఏడ్చింది మోనాల్. తనని నానా రకాలుగా, ప్రతిసారి ఏదో ఒక అలిగేషన్ పెట్టి ఏడిపిస్తున్నారని వాపోయింది. బిగ్‌బాస్ ముందు మొరపెట్టుకుంది.
అయితే బిగ్‌బాస్ స్పందించి, `ఎంతో మంది నిన్ను ఇష్టపడటం వల్లే ఇక్కడి వరకు వచ్చావని, లక్ష్యానికి అతి దగ్గరలో ఉన్నావని, పట్టుదల కోల్పోకుండా ముందుకు దుసుకెళ్ళాలని తెలిపాడు బిగ్‌బాస్. నిజానికి అలా ఎందుకు ప్రవర్తించిందనేది అందరిలోనూ సందేహం కలుగుతుంది. చివరి టైమ్‌లో సింపతి కోసం ఇలా చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెస్ట్ రూలర్‌గా అరియానా కొట్టేసినప్పుడు కూడా తనకు ఇలానే జరుగుతుందని, తాను బాగా ఆడానని, తనలో ఏదో జరుగుతుందని, ఒక్కతే బిగ్‌బాస్‌కి చెప్పుకుంది. మోనాల్ ప్రవర్తన మంగళవారం ఎపిసోడ్‌లో అనేక సందేహాలకు తావిస్తోంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 9, 2020, 12:10 AM IST