మోనాల్ గేమ్ ప్లాన్ ఎవరికీ అర్థం కావడం లేదు. మొదట్లో ఆమె చాలా అమాయకంగా కనిపించింది. ప్రతి చిన్న విషయానికి ఏడుపు లంకించుకోవడంతో ప్రేక్షకులకు విసుగు రాగా త్వరగానే దుకాణం సర్దేస్తుందనుకున్నారు. నాగార్జున సైతం ఆమె ఏడుపును చూసి నర్మదా అని పిలిచాడు. చిన్న చిన్న విషయాలకు కూడా ఏడవద్దని చెప్పాడు. ఐతే రెండవ వారం మొదలయ్యే నాటికి మోనాల్ రాటు తేలింది. హౌస్ లోని బాయ్స్ తో రొమాన్స్ మొదలుపెట్టింది. 

అఖిల్, అభిజిత్ లతో ఆమె సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టింది. వీరిద్దతో ఆమె చేస్తున్న రొమాన్స్ హౌస్ లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇతర ఇంటి సభ్యులతో కలవని మోనాల్, ఎక్కువగా వీరిద్దరితో మాత్రమే కనిపించేది. ఐతే ఇద్దరిలో అఖిల్ తో ఆమె రొమాన్స్ హైలెట్ అయ్యింది. అఖిల్ తో చాలా సన్నిహితంగా ఉండడంతో హోస్ట్ నాగార్జున కూడా వీరి రొమాన్స్ పై ఆరా తీశారు. అప్పుడప్పుడు అఖిల్ లేని సంధర్భంలో అభిజిత్ తో కూడా ఆమె సన్నిహితంగా ఉండడం, మాట్లాడం జరుగుతుంది. 

మోనాల్ తీరు అఖిల్ ని సైతం ఇబ్బంది పెడుతుంది. మోనాల్ తనకే సొంతం అని అఖిల్ అనుకుంటుండగా ఆమె అభిజిత్ ని కూడా ఎంటర్టైన్ చేయడం అతనికి నచ్చడం లేదు. అందుకే అప్పుడప్పుడూ మోనాల్ వద్ద తన అసహనం బయటపెడుతున్నాడు. ఈ మధ్య మోనాల్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అవినాష్ తో రొమాన్స్ మొదలు పెట్టింది. అతనికి ఫుడ్ తినిపించడం, ఎక్కువగా మట్లాడడం చేస్తుంది. 

మొదట్లో అవినాష్ ని పట్టించుకోని మోనాల్ ఫోకస్ సడన్ గా ఎందుకు షిఫ్ట్ అయ్యిందో అర్థం కావడం లేదు. అవినాష్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారుతుండగా,  అతనితో  రిలేషన్ పెట్టుకోవడం ద్వారా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం కలదని ఆమె భవిస్తూ ఉండవచ్చు. కారణం ఏదైనా మోనాల్ గేమ్ ప్లాన్ అందరినీ ఆశ్చర్యంలో ముంచి వేస్తుంది.