నటి సమీరారెడ్డి తెలుగులో ఎన్టీఆర్ సరసన రెండు చిత్రాలలో నటించింది. ఆ తరువాత కొన్ని అవకాశాలు దక్కించుకున్నప్పటికీ అమ్మడుకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వార్డేని వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు దూరమైంది ఈ బ్యూటీ.

పెళ్లైన ఏడాదికి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత తన వ్యాపారాలు, ఫ్యామిలీతో బిజీ అయిపోయినా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకుటచ్ లోనే ఉంటోంది. ప్రస్తుతం సమీరా రెడ్డి రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.

ప్రస్తుతం సమీరా ఐదు నెలల గర్భవతి. ఇప్పుడు తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తూ ఉన్న ఫోటోలను  ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇప్పటికీ తన స్విమ్ సూట్ బాగా ఫిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. సమీరా తన రెండో బిడ్డకు జూలైలో జన్మనిచ్చే అవకాశం ఉంది.