విజయ్ దేవరకొండ కి తెలుగు లో మాత్రమే కాకుండా, ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన ఓ తెలుగు,మళయాళ సినిమా కమిటయ్యారు.
విజయ్ దేవరకొండ గత చిత్రాలు వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్, లైగర్ ఇలా అన్నీ దారుణాతి దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. వీటన్నంటిలోకెల్లా లైగర్ వల్ల అయిన డ్యామేజ్ ఎక్కువ. అయినా విజయ్ దేవరకొండ క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ఖుషీ తో బిజీగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో యశోద నటి సమంత హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ దేవరకొండ కి తెలుగు లో మాత్రమే కాకుండా, ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన ఓ తెలుగు,మళయాళ సినిమా కమిటయ్యారు.
అయితే ఆగస్టులో ప్రకటించిన వృషభలో అర్జున్ రెడ్డి నటుడు మోహన్‌లాల్ కొడుకుగా నటించనున్నాడు. చిత్ర దర్శకుడు నంద కిషోర్ విజయ్ తో కీలక పాత్రలో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అయితే టీమ్ నుంచి అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మోహన్‌లాల్ ప్రస్తుతం అనేక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామా వృషభ 2023 లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది మలయాళం మరియు తెలుగులో షూట్ చేస్తారు. ఈ చిత్రం 2024 లో విడుదల కానుంది. ఈ సినిమా తండ్రి, కొడుకుల డ్రామాగా తెరకెక్కనుందని చెప్తున్నారు. ఏవీఎస్ స్టూడీయోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లో రూపొందనుందట. ప్రేమ, ప్రతీకారం వంటి రెండు భావోద్వేగాల మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ ఈ కథ సాగనుందట.
ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా ఖుషి అనే సినిమా రూపొందుతోంది. శివా నిర్వాణ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. త్వరలో జెర్శీ డైరక్టర్..గౌతమ్ తిన్ననూరితో విజయ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.
