మహేష్ బాబు కెరీర్లో 28వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో ఒక మలయాళం స్టార్ నటుడు కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ నటుడు మరెవరో కాదు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్.


గత కొద్ది రోజులుగా మహేష్ బాబు అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "సర్కారు వారి పాట". పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కళావతి పాట రిలీజై సెన్సేషన్ అవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అతడు మరియు ఖలేజా వంటి సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది.

మహేష్ బాబు కెరీర్లో 28వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో ఒక మలయాళం స్టార్ నటుడు కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ నటుడు మరెవరో కాదు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్. ఒక పవర్ఫుల్ పొలిటిషన్ మోహన్ లాల్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ పాత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అని అంటున్నారు.

మోహన్ లాల్ పాత్రకు మహేష్ పాత్రకు మధ్య జరిగే డ్రామా సీన్స్ సినిమాలో హైలెట్ గా ఉంటాయంటున్నారు. మొదట్లో సీఎంకు, సామాన్యుడైన మహేష్ కు మధ్య వివాదం జరుగుతుందని, సెకండాఫ్ లో మోహన్ లాల్ పాత్ర మహేష్ ఇంటెన్షన్ ని అర్దం చేసుకుని సాయిం చేస్తుందని..అదే విధంగా మహేష్ కూడా మోహన్ లాల్ పాత్రకు ఏ విధంగా సాయిం చేసాడన్నది సెకండాఫ్ లో నడిచే కథనం అని ఫిల్మ్ నగర్ వర్గాల కథనం.

ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా జోనర్లో తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట.

ఇక గత గతంలో మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో అతడు ఖలేజా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా రాబోతోంది. మరి కాగా గతంలో మోహన్ లాల్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది.