స్టార్ హీరో మమ్ముట్టి నటించిన 'లూసిఫర్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. హీరో పృధ్వీరాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు.

సినిమాలో చెప్పుకునే స్థాయిలో కథ లేకపోయినా.. హీరోయిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేశారు. దీంతో సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా పెద్ద హిట్టవ్వడంతో మోహన్ లాల్ మరోసారి పృధ్వీరాజ్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

'లూసిఫర్' సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. దీనికి 'ఎంపురన్' అనే టైటిల్ కూడా పెట్టారు. సినిమా మొదలుపెట్టడానికి ముందే చిన్న టీజర్ కూడా వదిలారు. ముంబై మాఫియా డాన్ లతో పోరాడే కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

టీజర్ తో అంచనాలు పెంచేసిన పృధ్వీరాజ్ సినిమాను అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. మరో విశేషమేమిటంటే.. 'లూసిఫర్' క్యారెక్టర్ ని బేస్ చేసుకొని ఓ సిరీస్ తీయబోతున్నట్లు పృధ్వీరాజ్ ప్రకటించారు.