కరోనా కష్టాలతో చిత్ర పరిశ్రమ విలవిలలాడుతున్నా.. సినీ తారలు మాత్రం అందరు బాగుండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, మోహన్‌బాబు, మహేష్‌, రవితేజ, యాంకర్‌ అనసూయ ఇలా సెలబ్రిటీలు, నిర్మాతలు సంస్థలు ఆడియెన్స్ కి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరు బాగుండాలని కోరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, `హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది- రామతత్వం! కష్టంలో కలిసి నడవాలన్నది- సీతాతత్వం! అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. పుణ్య దంపతులైన సీతారాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తున్నాను' అని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు చిరంజీవి. 

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తెలుగు ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన కరోనాని పోల్చుతూ విషెస్‌ చెప్పడం విశేషం. `ఆనాడు లక్ష్మణరేఖ దాటిన సీతమ్మ తల్లి ఎన్నో అష్టకష్టాలు పడి చివరికి శ్రీరాముని వల్ల రావణుని చెర వీడింది. ఈనాడు కరోనా జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు` అని తెలిపారు.

అలాగే సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, మాస్‌ మహారాజ రవితేజ, అనసూయ, వంటి హీరోలు రామనవమి శుభాకాంక్షలు చెప్తూనే ఇంట్లో సేఫ్‌గా ఉండాలని కోరారు.