విలక్షణ నటుడు డాక్టర్ మోహన్ బాబు తిరుమల శ్రీవారిని దర్శించారు.  నేడు ఉదయం విఐపి దర్శన వేళలో ఆయన శ్రీవారి దర్శనం అందుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో మోహన్ బాబుకు ఆశీర్వాదం తెలిపారు. అలాగే ఆలయ అధికారులు మోహన్ బాబును పట్టు వస్త్రాలతో సత్కరించడం జరిగింది. మోహన్ బాబుతో పాటు ఆయన కుమార్తె మంచు లక్ష్మీ సైతం తిరుమల వెళ్లడం జరిగింది. 

తిరుమల దేవస్థాన పాలక వర్గాన్ని మోహన్ బాబు పొగడ్తలతో ముంచెత్తారు. తిరుమలలో అవినీతి రహిత పాలన జరుగుతుందన్నారు. సామాన్యులు, ప్రముఖులు అనే బేధం లేకుండా అందరికీ సమానంగా శ్రీవారి దర్శనం కల్పించడం గొప్ప విషయం అన్నారు. నూతన సంవత్సరం ప్రారంభమైన కొద్ది కాలంలో రెండు సార్లు శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టం అని మంచు లక్ష్మీ తెలిపారు. 

చాలా కాలం తరువాత మోహన్ బాబు ఓ చిత్రంలో నటిస్తున్నారు. సన్ ఆఫ్ ఇండియా పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. అలాగే సూర్య హీరోగా విడుదలైన ఆకాశం నీ హద్దురా మూవీలో మోహన్ బాబు కీలక రోల్ చేశారు.