డైలాగ్ కింగ్ మోహన్ బాబు ముక్కుసూటితనం, మాట కరుకు గురించి అందరికీ తెలిసిందే. అలాగే డిసిప్లైన్ కి కూడా ఆయనను కేర్ ఆఫ్ అడ్రెస్ అంటారు. తేడా వస్తే చేయి చేసుకోవడానికి కూడా మోహన్ బాబు వెనుకాడడు. గతంలో సెట్స్ లో హీరోయిన్స్ పై చేయిచేసుకున్నాడన్న అపవాదు కూడా ఆయనపై ఉంది. ఇక మోహన్ బాబు వేదికపై మైక్ పట్టుకుంటే ఎవరికి షాక్ ఇస్తాడో అని భయపడే వాళ్ళు చాలా మందే ఉంటారు.

తాజాగా హీరో రానాకు మోహన్ బాబు చిన్న ఝలక్ ఇచ్చాడు. మంచు విష్ణు లేటెస్ట్ మూవీ మోసగాళ్లు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ వారం విడుదల కానుంది. దీనితో నిన్న మోసగాళ్లు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధిగాగా హీరో రానా కూడా హాజరయ్యారు. కాగా వేదికపై మోహన్ బాబు మాట్లాడేటప్పుడు రానా... భయపడుతూనే వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అప్పుడు నా కళ్ళ ముందే పుట్టి పెరిగావు.. నువ్వు కూడా సమయానికి రావా అన్నాడు. ఏడు గంటలకి వస్తా అని చెప్పి పది గంటలకు వస్తావా అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

నీ మూవీలో నేను నటిస్తున్నా కదా... రేపు కూడా నేను లేట్ గా షూటింగ్ కి వస్తా అన్నాడు. దానికి సమాధానంగా... షూటింగ్ మీ ఇంటి దగ్గరే కదా, మీరు ఎప్పుడు లేస్తే.. అప్పుడు కెమెరా పెట్టేస్తా అంటూ రానా చామత్కరించాడు. మొత్తంగా వేదికపై వీరి సంభాషణ ఆసక్తి గొలిపింది. ఇండో అమెరికన్ మూవీగా తెరకెక్కిన మోసగాళ్లు చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. సునీల్ శెట్టి కీలక రోల్ చేయగా... అల్లు అర్జున్ కామియో గా కనిపిస్తారట.