వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించామని చెప్పారు. అంతేకాదు మోహన్ బాబు పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని ప్రచారం చేసారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక రివర్స్ లో టాక్ వచ్చింది. మార్నింగ్ షో కే డిజాస్టర్ అయ్యిపోయింది. అయితే కలెక్షన్స్ లో ఇదో రికార్డ్ క్రియేట్ చేసిందని  చెప్తున్నారు. 

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”(Son Of India).మోహన్ బాబు (Mohan Babu) చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించారు. ఒక క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా వచ్చింది. సన్ ఆఫ్ ఇండియాకు డైమండ్ బాబు దర్శకుడు. మేస్ట్రోఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కించారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించామని చెప్పారు. అంతేకాదు మోహన్ బాబు పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని ప్రచారం చేసారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక రివర్స్ లో టాక్ వచ్చింది. మార్నింగ్ షో కే డిజాస్టర్ అయ్యిపోయింది. అయితే కలెక్షన్స్ లో ఇదో రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్తున్నారు.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు... ఈ సినిమాకు ఓపినింగ్ రోజున కేవలం 6 లక్షలు గ్రాస్ మాత్రమే రెవిన్యూ వచ్చింది. టోటల్ గా ఐదు రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే...మొత్తం మీద 35 లక్షల గ్రాస్ వచ్చిందని తేల్చారు. ఆ తర్వాత ఈ సినిమా థియేటర్స్ లోనే లేదు. దాంతో ఫైనల్ రన్ అక్కడితోనే ముగిసినట్లైంది. ఈ నేఫద్యంలో కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు ‘సన్నాఫ్‌ ఇండియా’ కలెక్షన్లు చూసాకా, ఇక ఆయనకు ఆ బిరుదు సరిపోదు అని వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

 సినిమాను 353 థియేటర్స్ లో రిలీజ్ చేస్తే.. బాక్సాఫీస్ వద్ద కనీస గౌరవప్రదమైన కలెక్షన్స్ కూడా రాలేదు. ఇది ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు లేని రికార్డ్ అని చెప్తున్నారు. ఇంత దారుణంగా ఈ సినిమా డిజాస్టర్ అవ్వలేదని చెప్తున్నారు. చాలా చోట్ల జనాలు లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి. పైగా షోలు పడిన చోట ఆక్యుపెన్సీ కేవలం 2-3% వరకు మాత్రమే ఉంది. మోహన్ బాబు సినీ కెరీర్ లోనే ‘సన్నాఫ్‌ ఇండియా’ భారీ డిజాస్టర్ గా నిలిచింది. మోహన్ బాబు సినీ కెరీర్ లోనే కాదు, ఈ మధ్య కాలంలో తెలుగు తెర పై కూడా ఇది బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రంగా నిలిచింది.

ఇక మోహన్ బాబు ఆ మధ్య స్టార్ హీరోల సినిమాలలో ముఖ్య పాత్రలతో రాగా.. ప్రధాన పాత్రలో సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. ఇప్పుడు ఆ లోటు భర్తీ చేసేందుకు ఈ సినిమాతో సిద్దమయ్యాడు మోహన్ బాబు. అయితే ఫలితం లేకుండా పోయింది.

ఈ సినిమాలో మోహన్ బాబుతో (Mohan Babu)పాటు శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషించారు. ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, రాజా రవీంద్ర, రఘుబాబు కనిపించారు. ఇళయరాజా సంగీత అందిస్తుండగా.. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అందించారు.