మా ఎన్నికల సరళిపై సీనియర్ నటుడు మోహన్ బాబు (mohan babu) సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల పరిస్ధితి చూస్తే మనసుకు కష్టంగా వుందని.. ఎవరు ఏం చేసినా ‘‘మా’’ అనేది ఒక కుటుంబం అని ఆయన చెప్పారు. విష్ణు మీ కుటుంబసభ్యుడని.. ఓటేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటేయాలని మోహన్ బాబు పిలుపునిచ్చారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు (maa elections) ఒక్కరోజే సమయం వున్న నేపథ్యంలో ఫిలింనగర్‌లో వాతావరణం వేడెక్కుతోంది. నిత్యం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మా పరువును బజారుకీడుస్తున్నారు. గత రెండు రోజుల నుంచి నాగబాబు (nagababu), నరేశ్ (naresh), శివాజీరాజా (shivaji raja) వంటి పెద్దల హడావుడి ఎక్కువైంది. తాజాగా మా ఎన్నికల సరళిపై సీనియర్ నటుడు మోహన్ బాబు (mohan babu) సంచలన వ్యాఖ్యలు చేశారు.
మా ఎన్నికల పరిస్ధితి చూస్తే మనసుకు కష్టంగా వుందని.. ఎవరు ఏం చేసినా ‘‘మా’’ అనేది ఒక కుటుంబం అని ఆయన చెప్పారు. విష్ణు మీ కుటుంబసభ్యుడని.. ఓటేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటేయాలని మోహన్ బాబు పిలుపునిచ్చారు. విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను కలుస్తామని.. సినీ పరిశ్రమ కష్టాలను ఇద్దరు ముఖ్యమంత్రులకు చెప్పుకుందామని ఆయన స్పష్టం చేశారు. మేనిఫెస్టోలోని హామీలను విష్ణు నెరవేరుస్తాడనే నమ్మకం వుందని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మా అధ్యక్షుడిని గతంలో ఏకగ్రీవంగా ఎన్నుకునేవారని.. కానీ ఇప్పుడు కొంతమంది బజారుకెక్కి పరువు తీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, రెండు రోజుల క్రితం కూడా చిత్ర పరిశ్రమకు తాను చేసిన సేవలను గుర్తు చేస్తూ తన కుమారుడు manchu vishnuని గెలిపించాలని మోహన్ బాబు బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇందులో ఆయన ఏమన్నారంటే, `నేను మీ అందరిలో ఒకడిని. నటులతో పాటు నటుడ్ని, ప్రొడ్యూసర్లతోపాటు ప్రొడ్యూసర్‌ని, దర్శకత్వ శాఖలో పనిచేసినవాడిని, ఇండస్ట్రీలో కష్టం వచ్చిన ప్రతిసారీ నేనున్నానని ముందు నిలబడ్డ దాసరి నారాయణరావు అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన బిడ్డని. చేసిన సాయం, ఇచ్చిన దానం ఎప్పటికీ చెప్పకూడదంటారు. కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్థాపించిన రోజు నుంచి, ఈ రోజు వరకు ఎన్నో చిత్రాలను నిర్మిస్తూ ఎంతో మంది కొత్త కొత్త టెక్నీషియన్లని, కళాకారులను పరిచయం చేసేవాడిని.
ALso Read:`మా` ఎన్నికల అధికారి మోహన్‌బాబు రిలేటివ్..నాగబాబు సంచలన ఆరోపణలు.. నరేష్ చెత్త అధ్యక్షుడంటూ కామెంట్
మన 24క్రాఫ్ట్ల్ లో ఉన్న ఎంతో మంది పిల్లలకి, స్వర్గస్థులైన ఎంతో మంది సినీ కళాకారుల పిల్లలకి మన విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యా సౌకర్యాలు కల్పించి, వాళ్లు గొప్ప స్థానాలకు చేరేలా చేశాను. ఇక ముందూ కొనసాగిస్తాను. నేను `మా` అధ్యక్ష పదివిలో ఉన్నప్పుడే వృద్ధాప్య పింఛన్లు ప్రవేశపెట్టినవాడిని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. `మా` అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు, అదొక బాధ్యత.
ఈ సారి ఎన్నికల్లో నా కుమారుడు మంచు విష్ణు `మా` అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు. నా బిడ్డ విష్ణు మంచు.. నా క్రమశిక్షణకి, నా కమిట్‌మెంట్‌కి వారసుడు. నా కుమారుడు ఇక్కడే ఉంటాడు, ఈ ఊళ్లోనే ఉంటాడు. ఏ సమస్య వచ్చినా మీ పక్కననిలబడి ఉంటాడని నేను మాటిస్తున్నా. కాబట్టి మీరు మీ ఓటుని మంచు విష్ణుతోపాటు పూర్తి ప్యానెల్‌కి కూడా వేసి ఒక సమర్థవంతమైన పాలనకు సహకరించాలని మనవి` అని తెలిపారు మోహన్‌బాబు.
