Asianet News TeluguAsianet News Telugu

‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ గా మోహన్ బాబు?

దర్శకుడు రతీశ్‌ బాలకృష్ణన్‌ ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ను తెరకెక్కించిన విధానం కట్టిపడేస్తుంది. ప్రతి సన్నివేశాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఇప్పుడీ సినిమాని మోహన్ బాబు  రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. 

Mohan babu in android-kunjappan remake jsp?
Author
Hyderabad, First Published Oct 18, 2020, 3:45 PM IST

రీసెంట్ గా  ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన మలయాళ చిత్రం ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప వెర్షన్‌ 5.25’. గతేడాది అక్కడ ‘ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ వెర్షన్‌ 5.25’గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి సక్సెస్  అందుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం మెప్పించింది.  ఆండ్రాయిడ్‌ కట్టప్ప ఫ్యామిలీలకు బాగానే నచ్చేసాడు. ఈ క్రమంలో ఈ సినిమా ని రీమేక్ చేయాలనే ఆలోచన మనవాళ్లకు వచ్చినట్లు తెలుస్తోంది.ఇక ఇందులో నటించేందుకు  విలక్షణ నటుడు మోహన్ బాబు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అంతేకాదు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలు టెక్నాలజీ అంటేనే పడని ఓ వృద్ధుడు రోబోతో కలిసి ఎలా జీవించాడన్నది ఈ  సినిమాలో ఎమోషనల్ గా చూపించాడు. ప్రధానపాత్ర భాస్కరరావు, అతని కొడుకు సుబ్రహ్మణ్యం పరిస్థితులను వివరిస్తూ చిత్రాన్ని ప్రారంభించిన దర్శకుడు నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ సీన్స్ అన్నీ  నేటి మిడిల్ క్లాస్ కుటుంబాలకు అద్దం పట్టాయి. మోడ్రన్ సొసైటిలో తమ కొడుకు లేదా కూతురు అత్యున్నత స్థానాలకు చేరాలని కోరుకుంటూ ఎంతో మంది తల్లిదండ్రులు వారిని ఉన్నత చదువులు చదివిస్తారు. అయితే, ఆ చదువుకు తగిన ఉద్యోగం రావాలంటే కన్నవారిని, ఉన్న ఊరిని వదలి వెళ్లాల్సిన పరిస్థితి ప్రతి కుటుంబంలోనూ మనకు కనిపిస్తుంది. దాన్నే గుండెలకు హత్తుకునేలా చూపించాడు దర్శకుడు.  ఆయా సన్నివేశాలన్నీ భావోద్వేగంతో సాగుతాయి.

 పుట్టిన ఊరిని వదిలి కొడుకుతో సిటీలకు వెళ్లలేక తల్లిదండ్రులు పడే వేదన అందరికీ తెలిసిందే. వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునేందుకు వచ్చే పని మనుషులు ఎలా వ్యవహరిస్తారు? వాళ్ల చర్యల వల్ల తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు పడతారన్నది కళ్లకు కట్టారు. ఫస్ట్ హాఫ్ అంతా ఈ సన్నివేశాలతో నడిపిన దర్శకుడు ఇంటర్వెల్ లో  పల్లెటూరికి రోబో రాకతో తర్వాత ఏం జరుగుతుందని ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించాడు. ఈ సినిమా మోహన్ బాబుకు బాగా నచ్చి చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు చెప్తున్నారు.

కాగా సైన్స్‌ ఫిక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25లో సూరజ్ వెంజారమోద్‌, సౌబిన్ సాహిర్, కెండీ జిర్దో, సైజు కిరు తదితరులు కీతక పాత్రల్లో
కనిపించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం మలయాళంలో పెద్ద విజయం సాధించింది. ఈ మూవీకి కేరళ ప్రభుత్వం నుంచి మూడు అవార్డులు కూడా లభించాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios