కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం ముదురుతుంది. పదేళ్లకు పైగా తమ వద్ద పనిచేస్తున్న హెయిర్ స్టైలిస్ట్ నాగశీనుపై ఉద్దేశపూర్వకంగానే దొంగతనం కేసు నమోదు చేశారన్న ఆరోపణ మంచు ఫ్యామిలీపై ఉన్న సంగతి తెలిసిందే.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం ముదురుతుంది. పదేళ్లకు పైగా తమ వద్ద పనిచేస్తున్న హెయిర్ స్టైలిస్ట్ నాగశీనుపై ఉద్దేశపూర్వకంగానే దొంగతనం కేసు నమోదు చేశారన్న ఆరోపణ మంచు ఫ్యామిలీపై ఉన్న సంగతి తెలిసిందే.
హెయిర్ స్టైలీష్ట్ వివాదంలో మంచు ఫ్యామిలపై ఆరోపణలు అంతకంతకు పెరుగుతున్నాయి. వివాదం ముదిరి బీసీ సంఘాల వరకూ వెళ్లింది. తనను నానా హింసలకు గురి చేయడంతో పాటుగా కులం పేరుతో దూషించారని నాగ శీను..మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణులపై సంచలన ఆరోపణలు చేశాడు.తతను మోకాళ్లపై కూర్చోబెట్టి కొట్టాడని..ఎన్నో ఎళ్లుగా పనిచేస్తున్నాతనపై ధారణంగా ప్రవర్తించారంటూ హెయిర్ స్టైలీష్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడంతో.. వివాదం మరింతముదిరింది.
తమ మనోభావాలను మంచుఫ్యామిలీ దెబ్బ తీసిందని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నాయీ బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. మంచు ఫ్యామిలీపై ఆరోపణలు చేసిన నాగశీను నాయీ బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో చెందిన వ్యాక్తి కావడంతో ఆ సంఘాలు స్పందించాయి. తనకు మంచు ఫ్యామిలీ చేతిలో ఏ రకమైన అవమానం జరిగిందన్న విషయాన్ని వివరిస్తూ నాగశీను చేసిన వీడియో వైరల్‌గా మారి.. అది నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు దగ్గరకు చేసింది.
నాగశీనును పై మంచు ఫ్యామిలీ ప్రవర్తన దారుణమని.. ఈ లెక్కన మంచు ఫ్యామిలీ తమ కులాన్ని దూషించిందని నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఆరోపించారు. దీంతో తక్షణమే నాయీబ్రాహ్మణులకు మంచు ఫ్యామిలీ క్షమాపణలు చెప్పాలని, లేకపోతే మంచు ఫ్యామిలీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని ఆయన తెలిపారు.
ఇక ఈ వివాదం మరింత ముదిరినట్టు తెలుస్తోంది. నాయీబ్రహ్మణుల దగ్గర నుంచి ఈ వివాదం బీసీసంఘాల వద్దకు వెళ్లింది. బీసీసంఘాలు ఆయనపై మండిపడుతున్నాయి. జాతీయ బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఈ వివాదంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ మోహన్ బాబు చాలా దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు మోహన్ బాబు లాంటి సంపన్నులను తాము ఎంతో మందిని చూశామని అన్నారు.
కులం పేరుతో ఒక వ్యక్తిని కించపరచడం దారుణమని చెప్పారు. మోహన్ బాబు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక్క శాతం జనాభా ఉండే సామాజికవర్గం నుంచి వచ్చిన నీవు 56 శాతం జనాభా ఉండే బీసీల గురించి మాట్లాడతావా? అని ప్రశ్నించారు. ఈ వివాదం ఇంత ముదురుతున్నా మంచు ఫ్యామిలీ మాత్రం దీని గురించి ఇప్పటి వరకూ స్పందించలేదు. వివాదాలతో ఆడుకోవడం మంచు ఫ్యామిలీకి ఇప్పుడు కొత్తేం కాదు.
గతంలో బ్రహ్మణులు కూడాతమను అవమానించారంటూ మంచు ఫ్యామిలీపై ఉద్యమం చేశారు.. రీసెంట్ గా తమ కుటుంబంపై ట్రోలింగ్స్ చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామంటూ.. వార్నింగ్ ఇచ్చారు మోహన్ బాబు.. ఆమధ్య మా ఎన్నికలు, రీసెంట్ గా ఇండస్ట్రీ సమస్యల విషయంలో కూడామోహన్ బాబు కుటుంబం వివాదాలతో రకరకాలు ఆరోపణలు ఫేస్ చేస్తోంది.
