ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పగానే ఉంటుందని అంటున్నారు నటుడు మోహన్ బాబు. ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంగా ఆయన జగన్ ని కొనియాడారు. శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తన బిడ్డ జగన్ కి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చారని జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని అన్నారు. 

ప్రజలు ఆశీస్సులు అందజేసి జగన్ ని ముఖ్యమంత్రి చేశారని, కచ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్ అంటూ కామెంట్స్ చేశారు. మోహన్ బాబు కుటుంబానికి జగన్ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. మోహన్ బాబుతో పాటు ఆయన తనయులు కూడా జగన్ కి మద్దతుగా నిలిచారు.

ఈ ఎన్నికల్లో జగన్ గెలవడం ఖాయమని మోహన్ బాబు ముందే తన ఆశీస్సులు జగన్ కి అందించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది.

తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.