సినీ నటుడు మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎలక్షన్స్ సమయంలో జోరుగా ప్రచారాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా జగన్ ఆయనకు ఒక ముఖమైన పదవి ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా టీటీడీ దేవస్థానం చైర్మన్ పదవికి మోహన్ బాబు ఎన్నికైనట్లు టాక్ వచ్చింది. 

అయితే ఈ విషయంపై మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి పదవి కోరుకోవడం లేదని పదవుల కోసం పాలిటిక్స్ లోకి రాలేదని చెప్పారు. కేవలం జగన్ ని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన కోరిక అంటూ ప్రజల ముఖ్యమంత్రిగా జగన్ ని చూడాలని రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. 

గత కొన్ని రోజులుగా తాను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ రేసులో ఉన్నట్లుగా వార్తలు వస్తుండడంతో చాలా మంది సన్నిహితులు తానకు ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. మీడియా పుకార్లను ప్రోత్సహించవద్దని  ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు వివరణ ఇచ్చారు.