Asianet News TeluguAsianet News Telugu

నా ఆస్తులను తాకట్టు పెట్టా.. మోహన్ బాబు కామెంట్స్!

శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని.. ఆ కారణంగా తాను ఆస్తులను తాకట్టు పెట్టి విద్యాసంస్థలను నడిపిస్తున్నట్లు ప్రముఖ నటుడు, విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు తెలిపారు. 

mohan babu comments at sri vidyanikethan college event
Author
Hyderabad, First Published Jan 23, 2019, 11:09 AM IST

శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని.. ఆ కారణంగా తాను ఆస్తులను తాకట్టు పెట్టి విద్యాసంస్థలను నడిపిస్తున్నట్లు ప్రముఖ నటుడు, విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు తెలిపారు.

మంగళవారం నాడు చిత్తూరులో చంద్రగిరి మండలంలో శ్రీవిద్యానికేతన్ నిర్వహించి ఓ వేడుకలో పాల్గొన్న మోహన్ బాబు రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ను చెల్లించడం లేదని, దాదాపు ప్రభుత్వం నుండి రూ.20 కోట్ల రూపాయలు రావాల్సివుందని అన్నారు.

ఈ కారణంగా తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని మోహన్ బాబు తెలిపారు. బ్యాంక్ లో రుణాలు తీసుకొని, తన ఆస్తులను తాకట్టు పెడుతూ కాలేజీలను నడిపిస్తున్నట్లు స్పష్టం చేశారు.

నెలకు కాలేజీ నడపడానికి ఆరు కోట్ల ఖర్చు అవుతున్నట్లు, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోయినా.. స్టాఫ్ కి సాలరీలు సమయానికి ఇస్తున్నామని అన్నారు. ఇరవై ఆరు ఏళ్లుగా ఉన్నత విద్యనందించడంలో ఎక్కడా రాజీ పడలేదని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios