షమీని నేను పెళ్లి చేసుకుంటా.. కానీ ఒక్క కండిషన్.. షాకిస్తున్న హీరోయిన్ కామెంట్స్
టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ ఐసీసీ వరల్డ్ కప్ లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. షమీ ఈ వరల్డ్ కప్ లో సెన్సేషన్ గా మారిపోయాడు. హార్దిక్ పాండ్య గాయం కారణంగా తుది జట్టులో ఆడుతున్న షమీ తన బౌలింగ్ పెర్ఫామెన్స్ తో అదరగొడుతున్నాడు.

టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ ఐసీసీ వరల్డ్ కప్ లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. షమీ ఈ వరల్డ్ కప్ లో సెన్సేషన్ గా మారిపోయాడు. హార్దిక్ పాండ్య గాయం కారణంగా తుది జట్టులో ఆడుతున్న షమీ తన బౌలింగ్ పెర్ఫామెన్స్ తో అదరగొడుతున్నాడు. అతడు బంతి విసిరితే వికెట్ అన్నట్లుగా ఇప్పటి వరకు అతడి జోరు సాగింది.
అయితే షమీ తన పర్సనల్ లైఫ్ లో సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. షమీకి, అతడి భార్యకి మధ్య చాలా కాలంగా మనస్పర్థలు చెలరేగుతున్నాయి. విభేదాల కారణంగా వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. కలసి జీవితం సాగించడం లేదు. అయితే షమీ తన పర్సనల్ లైఫ్ సమస్యలన్నీ పక్కన పెట్టి జట్టు కోసం ఆడుతున్న విధానానికి ప్రశంసలు దక్కుతున్నాయి. వీరిద్దరూ చట్టపరంగా విడిపోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
షమీ బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ బ్యాట్స్ మెన్ ని ముప్పతిప్పలు పెడుతుంటే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా షమీకి అభిమానులు పెరిగారు. సెలెబ్రిటీలు సైతం షమీకి అభిమానులుగా మారుతున్నారు. ఊసరవెల్లి చిత్రంలో కీలకి పాత్రలో నటించిన పాయల్ ఘోష్ మరోసారి వార్తల్లో నిలిచింది.
పాయల్ ఘోష్ ఏకంగా షమీకి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టింది. ట్విట్టర్ లో ఆమె షమీ గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆమె సరదాగా ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ నెటిజన్లు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. 'షమీ నువ్వు ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ' అంటూ పాయల్ ఘోష్ కామెంట్ పెట్టింది.
షమీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉన్న టైమ్ లో పాయల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కొందరు నెటిజన్లు పాయల్ ప్రపోజల్ పై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మనోడికి ఎన్ని వికెట్లు పడగొట్టాలో చెబితే చేస్తాడు కానీ.. ఇలాంటి కండిషన్ పెడితే ఎలా అని అంటున్నారు. మరికొందరు గతంలో పాయల్ ముస్లిం లని విమర్శించినా వ్యాఖ్యలని గుర్తు చేస్తూ.. షమీ కూడా ముస్లిం కదా ఎలా పెళ్లి చేసుకుంటావ్ అని ప్రశ్నిస్తున్నారు. పాయల్ ఘోష్ ఊసరవెల్లి తో పాటు మంచు మనోజ్ ప్రయాణం చిత్రంలో కూడా నటించింది. ఆమె తరచుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమని విమర్శిస్తూ టాలీవుడ్ పై ప్రశంసలు కురిపించడం చూస్తూనే ఉన్నాం.