సక్సెస్ అందితే మంచి నిర్ణయం తీసుకున్నావని పొగుడుతారు. అదే అపజయాలు అందితే కొంచెం ఆలోచించాల్సింది అంటూ ఉచిత సలహాలు ఇచ్చేస్తుంటారని బాలీవుడ్ నటుడు మహ్మద్ జీషన్ చెబుతున్నాడు. 

అమిర్ ఖాన్ - షారుక్ ఖాన్ లతో నటించిన రెండు సినిమాలు ఇటీవల ఫ్లాప్ అవ్వడంతో..  ఆ సినిమాలు ఎందుకు చేశావని చాలా మంది ప్రశ్నిస్తున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో  జీషన్ తెలిపాడు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ బడా సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్న మహ్మద్  జీషన్ రీసెంట్ గా షారుక్ జీరో సినిమాలో అలాగే అమీర్ ఖాన్ థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ సినిమాలో నటించాడు. 

ఈ బడా సినిమాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా చతికిల పడ్డాయి. దీంతో జీషన్ కి అనుకున్నంతగా గుర్తింపు దక్కలేదు. 'ఎక్కడికెళ్లినా అందరూ ఆ సినిమాల్లో ఎందుకు నటించావ్.. కొంచెం ఆలోచించాల్సింది' అంటూ అదే పనిగా ప్రశ్నిస్తున్నట్లు  జీషన్ వివరించాడు. ఇక గెలుపోటములు జీవితంలో సహజమని కథలో ప్రాధాన్యం ఉండి.. పాత్ర నచ్చితేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటానని ఈ నటుడు స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.