బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్ అంటే.. బాగా ఫేమస్. ఆయన ఇంట్లోకి వెళ్ళడం అంటే సామాన్యులకు సాధ్యం కాని పని.. కాని ఓ మోడల్ కు మాత్రం ఆ ఇంట్లో రాచమర్యాదలు జరిగాయి.. సాధరంగా ఆహ్వానించి.. స్వయంగా పిజ్జా చేసిపెట్టారు షారుక్..  

నవ్‌ప్రీత్ కౌర్ అనే ఓ చిన్న మోడల్ ను తన ఇల్లు మన్నత్ లోకి సాధరంగా స్వాగతం పలికారు షారుఖ్ ఖాన్ అండ్ ఫ్యామిలీ. అంతే కాదు ఆమెకు అతిథి మార్యాదలతో పాటు రాజమర్యాదలు చేశారు. అంతేనా.. బాలీవుడ్ బాద్ షా.. ఆ మోడల్ కోసం స్వయంగా పిజ్జా కూడా తాయారు చేశాడు. ఈ విషాయన్ని ఆ మోడల్ నవ్‌ప్రీత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్లడించింది. షారుఖ్ ఇంట్లో తాను గడిపిన కొన్ని పోటోస్ ను తన సోషల్ మీడియా పేజ్ లో పంచుకుంది బ్యూటీ. ఈఫోటోస్ లో షారుఖ్ తో దిగినసెల్ఫీతో పాటు.. అతను తయారు చేసిన పిజ్జా.. మరియు అతని చిన్న కుమారుడు అబ్‌రామ్ ఖాన్ ఆటోగ్రాఫ్ కూడా ఉన్నాయి.

ఇక ఈపోస్ట్ కు కొంత క్యాప్షన్ కూడా రాసింది మోడల్ నవ్ ప్రీత్. మన్నాత్‌లో గడిపిన ఈరోజు నా జీవితంలో చాలా స్పెషల్ అంటూ పోస్ట్ చేసింది. పనిలో పనిగా షారుఖ్ కు సారీ కూడా చెప్పిందీ బ్యూటీ. తాను ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టనని ప్రామిస్ చేసిందట. కాని.. ఇవి తన దగ్గర దాచుకోలేనంత విలువైన సంపద. అది అందరికి తెలియాలి... బాలీవుడ్ కు రారాజు తనకోసం పిజ్జా చేశాడు. అది కూడా వెజ్ పిజ్జా.. ఈ విషయం చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అన్నారు బాలీవుడ్ మోడల్. 

View post on Instagram

నిజంగా తాను షారుఖ్ ఇంట్లో.. మన్నత్ లో ఉన్నాను అంటే అది కలగానే అనిపించింది. ఎవరైనా తనను నిద్ర లేపుతారేమో అని అనుకున్నాను. అంతే కాదు షారుఖ్ తో కలిసి డైనింగ్ ను పంచుకోవడం.. నాజీవితంలో మర్చిపోలేను.. అదే టైమ్ లో నేను వాష్ రూమ్ దారి అడగడం.. అక్కడ అంత మంది ఉన్నా.. స్వయంగా షారుఖ్ తనను డోర్ వరకూ తీసుకెళ్లడం..ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అన్నారు నవ ప్రీత్. అద్దంలో నన్ను నేను చూసుకుని ఉప్పొంగిపోయాను అన్నారు. నవప్రీత్ ను షారుఖ్ ఖాన్ తన భార్యకు పరిచంచ చేస్తూ.. గౌరీ ఖాన్‌ను డార్లింగ్ అని పిలిచారట. ఇక తన చిన్న తనయుడికి కొత్త బెస్ట్‌ఫ్రెండ్ గా పరిచయం చేసినట్టు వెల్లడించింది మోడల్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.