అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నటీనటుల విషయంలో చిత్ర యూనిట్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. హీరోయిన్ విషయంలో కూడా ఇంకా సందిగ్దత కొనసాగుతూనే ఉన్నాయి. 

ఇటీవల ఈ చిత్రంలో నటించేందుకు క్రేజీ హీరోయిన్ పూజ హెగ్డే ఖరారైపోయినట్లు వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్ ప్రకటించకపోయినా పూజా హెగ్డే భారీ రెమ్యునరేషన్ తో ఈ చిత్రానికి అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం కోసం పూజా హెగ్డేని తప్పించి మరో హీరోయిన్ ని ఎంచుకున్నట్లు టాక్. 

హాట్ మోడల్ గా గుర్తింపు సొంతం చేసుకుంది కేతిక శర్మ. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ అనే చిత్రంలో నటిస్తోంది. తన హాట్ గ్లామర్ తో అదరగొట్టే కేతిక అయితే అఖిల్ సరసన సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరు. ఈ చిత్రం కోసం అంత రెమ్యునరేషన్ ధారపోయడం అవసరం లేదని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే కేతికతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంలో కేతిక నటించడం ఖాయం అయితే ఆమె ఖాతాలో గోల్డెన్ ఛాన్స్ చేరినట్లే.