సింగర్ రాబిన్ పై అమెరికన్ మోడల్ లైంగిక ఆరోపణలు చేశారు. ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె వెల్లడించారు.

సింగర్ రాబిన్ పై అమెరికన్ మోడల్ లైంగిక ఆరోపణలు చేశారు. ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. ఓ మ్యూజిక్‌ వీడియో షూటింగ్‌ చేస్తున్నప్పడు సింగర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ప్రముఖ అమెరికన్‌ మోడల్‌ ఎమిలీ రటాజ్‌కోవ్స్‌కీ ఆరోపించింది. 2013లో బ్లర్డ్ లైన్స్ అనే మ్యూజిక్‌ వీడియో షూట్‌ సమయంలో సమయంలో అమెరికన్‌ సింగర్‌ రాబిన్ తికే తాగి సెట్స్‌పైకి వచ్చాడు. 'అంతేకాకుండా నా చాతిని తాకాడు. ఓ వ్యక్తి స్పర్శను నేను వెంటనే తెలుసుకున్నాను. 

ఎవరా అని వెనక్కి తిరిగి చేస్తూ..రాబిన్‌ వెకిలిగా నవ్వుతూ కనిపించాడు. వెంటనే నేను అక్కడి నుంచి పరిగెత్తాను. అప్పుడు మొదటిసారి నేను నగ్నంగా ఉన్నట్లు అనిపించింది' అని ఆమె తెలియజేశారు. 

ఈ మ్యూజిక్‌ వీడియోలో ఎమిలీతో పాటు మరో ఇద్దరు మోడల్స్‌ సైతం నగ్నంగా కనిపించారు. షూటింగ్‌ వరకు నగ్నంగా ఉన్నా తానెప్పుడూ అలా ఫీల్‌ అవ్వలేదని, రాబిన్‌ చర్యలతో సిగ్గుతో సెట్‌ వెనకాల దాక్కున్నట్లు ఎమిలీ ఆరోపించింది. 

కాగా ఇటీవలె ఈమె రాసిన మై బాడీ అనే పుస్తకం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాబిన్‌పై ఎమిలీ చేసిన కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై సింగర్‌ రాబిన్‌ ఇంత వరకు స్పందించలేదు.