'సై.. రా' విషయంలో అతడికే ఓటు!

mm kiravani to compose for chiranjeevis sye Raa movie
Highlights

సై..రా కు కీరవాణి సంగీతం

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా 'సై రా నరసింహారెడ్డి' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ముందుగా ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ.ఆర్.రెహ్మాన్ ను తీసుకున్నారు. కానీ ఆయన బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ స్థానంలోకి ఎవరిని తీసుకుంటారా..?  అనే విషయంలో ఎస్.ఎస్.తమన్ పేరు బాగా వినిపించింది. 'సై రా' మోషన్ పోస్టర్ కు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పించింది. దీంతో ఆయననే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటారని అన్నారు. కానీ తనను 'సై రా' టీం సంప్రదించలేని తేల్చేశారు తమన్. 

మధ్యలో కీరవాణి పేరు కూడా ప్రస్తావనలోకి వచ్చింది. గతంలో పీరియాడిక్ చిత్రాలకు పని చేసిన అనుభవం కూడా ఉంది. దీంతో చిత్రబృందం ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో కొన్ని చర్చలు కూడా జరిపారని సమాచారం. రాజమౌళి కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారని టాక్. దీంతో కీరవాణి ఈ ప్రాజెక్ట్ ను అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం కీరవాణి ఒక్కో సినిమాకు కనీసం మూడు కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఈ సినిమాకు కూడా అదే రేంజ్ లో పారితోషికం అందుకోబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం కీరవాణి 'సవ్యసాచి' సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. 

loader