‘ఆస్కార్’ దక్కింది.. పట్టలేని ఆనందం.. పాట రూపంలోనే ఎంఎం కీరవాణి స్పీచ్
‘నాటు నాటు’కు ఆస్కార్ అందుకుని ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, చంద్రబోస్ చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మకమైన అవార్డు అందిన ఆనందంలో పాట రూపంలో మాట్లాడి కీరవాణి ఆకట్టుకున్నారు.
‘ఆర్ఆర్ఆర్’తో భారతీయులు గర్వించే క్షణం లభించింది. 130 కోట్ల ఇండియన్స్ నిరీక్షణ ఫలించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు (Oscar 2023) తెలుగోడి సొంతం అయ్యింది. సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’ (Naatu Naatu) కు ఆస్కార్ అవార్డు దక్కింది. అమెరికాలోని లాస్ ఎంజెల్స్ లో ఘనంగా జరుగుతున్న ఆస్కార్స్ వేదికపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (Keeravani), లిరిసిస్ట్ చంద్రబోస్ (Chandra Bose) అవార్డును అందుకున్నారు. అంతర్జాయతీ వేదికపై ప్రతిష్టాత్మకమైన అవార్డను సొంతం చేసుకోవడంతో ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి. ఇండియన్ కూడా గర్విస్తున్నారు.
అయితే అవార్డును స్వీకరించేందుకు వేదికపైకి వెళ్లిన ఎంఎం కీరవాణి, చంద్రబోస్ తమ స్వీచ్ తో ఆకట్టుకున్నారు. ఆస్కార్ అవార్డు దక్కిన ఆనందంలో ఎంఎం కీరవాణి మాటలు మరిచి పాటరూపంలో తన సంతోషాన్ని వ్యక్త పరిచారు... ‘ఆస్కార్ అందించిన అకాడమీకి ధన్యవాదాలు.. ఈరోజు అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా మైండ్ లో ఒకే ఒక కోరక ఉండింది. రాజమౌళి అండ్ మా కుటుంబంతో పాటు ప్రతి భారతీయుడు గర్వించేలా ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అందుకుంది. మమల్ని ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంచింది. ఇందుకు క్రుషి చేసిన కార్తికేయకు థ్యాంక్స్’ అంటూ పాట రూపంలో స్పీచ్ అదరగొట్టారు.
మరోవైపు లిరిసిస్ట్ చంద్రబోస్ తన ఆనందాన్ని అదుపు చేసుకోలేకపోయారు. పట్టలేని ఆనందంతో ఆస్కార్ అవార్డును హాల్ లోని అందరికీ చూపిస్తూ తన సంతోషాన్ని వ్యక్త పరిచారు. చివరల్లో వేదికపై ‘నమస్తే’ అంటూ చంద్రబోస్ తెలుగోడి మార్క్ చాటారు. ఆస్కార్ వరించడం పట్ల సినీ తారలు, దేశంలోని ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి భారతీయుడు గర్వపడే క్షణం రావడంతో సంతోషిస్తున్నారు. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ ద్వారా ఇండియాకు మరోో ఆస్కార్ అవార్డు దక్కింది.