ఎమ్మెల్యేగా మరియు జబర్దస్త్ జడ్జిగా రోజా ఫుల్ బిజీ. వైసీపీ పార్టీలో కీలక నేతగా ఉన్న రోజా, ఏపీఐఐసి చైర్ప్ పర్సన్ గా ఉన్నారు. రాజకీయాలలో ఈమెకు ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. ముక్కు సూటిగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే రోజా అంటే ప్రత్యర్థులకు హడల్. కాగా హీరోయిన్ గా రోజా దాదాపు మూడు దశాబ్దాలు ఉన్నారు. టాప్ హీరోయిన్ గా స్టార్ హీరోల ప్రక్క అనేక చిత్రాలలో చేశారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ మరియు  కన్నడ చిత్రాలలో నటించారు. 

కొన్నాళ్ల వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన రోజా రాజకీయాలలో బిజీ అయిన తరువాత సినిమాలపై కొంచెం ఫోకస్ తగ్గించారు. ఐతే ఆమె కామెడీ షో జబర్దస్త్ లో మాత్రం సుదీర్ఘంగా కొనసాగారు. 2014నుండి ఆమె ఆ కామెడీ షోకి నాగబాబుతో కలిసి జడ్జిగా ఉన్నారు. ఎమ్మెల్యే అయినా కూడా బుల్లి తెరపై ఈమె సందడి చేస్తూ ఉంటారు. కాగా రోజా మళ్ళీ సినిమాలలో నటిస్తే చూడాలని అనుకునే ఫ్యాన్స్ ఉన్నారు. 

రోజా చివరిసారి 2015లో ఓ తమిళ చిత్రంలో కనిపించడం జరిగింది. తెలుగులో ఆమె చివరి చిత్రం 2013లో విడుదలైంది. తాజాగా ఓ టీవీ షోలో మీరు సినిమాలోకి ఎప్పుడు కమ్ బ్యాక్ ఇస్తారని అడుగగా, ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. రోజా మాట్లాడుతూ నాకు సినిమాలలో మళ్ళీ నటించాలని ఉంది. ఐతే చిరంజీవి లేదా నాగార్జున చిత్రాలలో అయితే ఒకే అని చెప్పారు. కాగా బాలకృష్ణ మరియు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో ఓ పాత్రకు రోజాను అడిగారని టాక్ వినబడుతుంది.