Asianet News TeluguAsianet News Telugu

గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన దిగ్గజ నటుడు.. రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డు

ప్రముఖ బాలీవుడ్ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మిథున్ చక్రవర్తి ఈ ఉదయం ఆసుపత్రి పాలయ్యారు. మిథున్ చక్రవర్తి హిందీలో వందలాది చిత్రాల్లో నటించారు.

Mithun Chakraborty hospitalised due to pain in chest dtr
Author
First Published Feb 10, 2024, 12:52 PM IST | Last Updated Feb 10, 2024, 12:52 PM IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మిథున్ చక్రవర్తి ఈ ఉదయం ఆసుపత్రి పాలయ్యారు. మిథున్ చక్రవర్తి హిందీలో వందలాది చిత్రాల్లో నటించారు. బెంగాలీ చిత్ర పరిశ్రమలో కూడా రాణించారు. అతిలోక సుందరి శ్రీదేవితో కూడా అనేక చిత్రాల్లో మిథున్ చక్రవర్తి నటించారు. 

అయితే ఈ ఉదయం మిథున్ చక్రవర్తి అస్వస్థతకి గురయ్యారు. గుండెలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కోల్ కతా లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఇంకా బయటకి రాలేదు. 

మిథున్ చక్రవర్తికి ఇటీవల జనవరి 26న కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుని ప్రకటించింది. తనకి పద్మ భూషణ్ అవార్డు రావడం పట్ల మిథున్ సంతోషం వ్యక్తం చేశారు. నేను ఎప్పుడూ ఎవరిని ఏది అడగలేదు. ఈ అవార్డు నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు మిథున్ తెలిపారు. 

ముథున్ చక్రవర్తికి రెండేళ్ల క్రితమే అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. రెండేళ్ల క్రితం మిథున్ చక్రవర్తికి బెంగుళూరులో కిడ్నీకి సంబంధించిన సర్జరీ జరిగింది. ఇప్పుడు ఆయనకి గుండె నొప్పి సమస్య మొదలయింది. 73 ఎల్లా వయసులో కూడానా మిథున్ చక్రవర్తి నటుడిగా రాణిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ఐఏఎస్ అధికారిగా నటించి మెప్పించారు. 

మ్రిగయ, తాహదేరి కథ, స్వామి వివేకానందా చిత్రాలకు మిథున్ చక్రవర్తికి జాతీయ అవార్డులు లభించాయి. అనేక ఫిలిం ఫేర్ అవార్డులు కూడా సొంతం అయ్యాయి.  మ్రిగయ 1976లో ఆయన డెబ్యూ చిత్రం. డెబ్యూ చిత్రంతోనే జాతీయ అవార్డు అందుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios