అక్కినేని అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఏవరేజ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా రెండో రోజు రెండున్నర కోట్లను సాధించింది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'ఎఫ్ 2' తప్ప మరే సినిమా లేకపోయినా.. అఖిల్ సినిమాకు మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు ఏరియాల వారీగా కలెక్షన్లు.. 

నైజామ్..................రూ.2.03 కోట్లు

సీడెడ్...................రూ.0.82 కోట్లు

ఉత్తరాంధ్ర............రూ.0.72 కోట్లు 

కృష్ణ.......................రూ.0.45 కోట్లు  

గుంటూరు...............రూ.0.74 కోట్లు 

ఈస్ట్........................రూ. 0.36 కోట్లు 

వెస్ట్.........................రూ.0.28 కోట్లు  

నెల్లూరు....................రూ.0.19 కోట్లు  

మొత్తంగా సినిమా రూ.5.59 కోట్లను రాబట్టింది. మరి లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి!

మిస్టర్ మజ్ను: ఫస్ట్ డే కలెక్షన్స్..దొబ్బినట్టే!
 

టైటిలే కాదు... (అఖిల్ 'మిస్ట‌ర్ మ‌జ్ను' రివ్యూ)