మిస్టర్ మజ్నుతో ఎంతో నమ్మకం పెట్టుకున్న అక్కినేని అకిల్ కు మరో ఫ్లాప్ t తప్పేలా కనిపించడం లేదు. మొదటి మిస్టర్ మజ్ను ఊహించని ఓపెనింగ్స్ ను అందుకుంది. కనీసం తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి క్రేజ్ కూడా సినిమాకు పెద్దగా అంచనాలను ఏమి క్రియేట్ చేయలేకపోయింది అని క్లారిటీగా అర్ధమవుతోంది. 

సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 5 కోట్ల షేర్స్ ను కూడా అందుకోకపోవడం గమనార్హం. మొత్తంగా 24 కోట్ల థ్రియేటికల్ బిజినెస్ చేసిన మిస్టర్ మజ్ను మినిమమ్ 30 కోట్ల షేర్స్ వరకు అందుకుంటేనే హిట్ కొట్టినట్లు. కానీ మొదటి రోజే సినిమా అంచనాలకు తగ్గట్టు ఓపెనింగ్స్ ను అందుకోలేకపోయింది. నైజం ఏపీ లో అయితే 3.5 కోట్ల షేర్స్ మాత్రమే అందినట్లు తెలుస్తోంది. 

ఇక ఏరియాల వారీగా వచ్చిన షేర్స్ ఈ విధంగా ఉన్నాయి. 

నైజం........ 1 .02కోట్లు 

వైజాగ్......... 0.41కోట్లు 

ఈస్ట్............ 0.20కోట్లు 

వెస్ట్............. 0.16కోట్లు 

కృష్ణ............. 0.26కోట్లు 

గుంటూరు...... 0.54కోట్లు 

నెల్లూరు.......... 0.12కోట్లు 

సీడెడ్............. 0.44కోట్లు 

ఏపి+తెలంగాణ..... 3.15 కోట్లు 

కర్ణాటక............. 0.68కోట్లు 

యూఎస్ఏ......... 0.35కోట్లు 

రెస్ట్ ఎస్టిమేటెడ్...... 0.17కోట్లు 

వరల్డ్ వైడ్............. 4.35 కోట్లు (షేర్స్)