ప్రముఖ సైంటిస్ట్ రాకేష్ ధావన్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో 'మిషన్ మంగళ్' అనే సినిమాను రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇందులో రాకేష్ ధావన్ పాత్ర పోషిస్తున్నాడు. 

2013లో భారత్ చేపట్టిన 'మంగళ్‌యాన్‌‌' మిషన్ నేపధ్యంలో సాగే సినిమా ఇది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. 'మంగళ్‌యాన్‌' ప్రయోగం చేపట్టే సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనలతో ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్ బట్టి తెలుస్తోంది.

ఈ సినిమాలో విద్యాబాలన్ కీలక పాత్ర పోషించింది. తాప్సి, నిత్యా మేనన్‌, సోనాక్షి సిన్హా, శర్మన్‌ జోషి, కీర్తి కుల్హరి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జగన్ శక్తి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‌