బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మిషన్ మంగళ్'. 2013లో భారత్ చేపట్టిన 'మంగళ్ యాన్' మిషన్ నేపధ్యంలో తెరకెక్కించిన సినిమా ఇది. జగన్ శక్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్ ని విడుదల చేశారు. ముందుగా అక్షయ్ కుమార్.. జీఎస్‌ఎల్‌వీ ఫ్యాట్‌బాయ్‌ విఫలమైందని ప్రకటిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉందటూ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.

'మార్స్‌ మిషన్‌కు భారత్‌ సిద్ధం కావాలి' అని ఇస్రో అధికారులు రాకేశ్‌కు చెప్తారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. 'ఇది జరగదని ఇస్రోకు కూడా తెలుసు' అని వెనకడుగు వేస్తారు. ఈ క్రమంలో ఆయన టీం మిషన్ మంగళ్ ని ఎలాగైనా సాధించాలని ప్రోత్సహిస్తుంటుంది. 

ఫైనల్ గా భారత్ మంగళ్ యాన్ ను మార్స్  పైకి ఎలా విజయం సాధించారనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కుతోంది. ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.