హాలీవుడ్ క్రేజీ స్టార్ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ 7 జూలై 12న ఇండియాలో రిలీజయింది. గత కొన్నేళ్లుగా ఇండియన్ ఆడియన్స్ హాలీవుడ్ చిత్రాలని కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు.
హాలీవుడ్ క్రేజీ స్టార్ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ 7 జూలై 12న ఇండియాలో రిలీజయింది. గత కొన్నేళ్లుగా ఇండియన్ ఆడియన్స్ హాలీవుడ్ చిత్రాలని కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు. కంటెంట్ బాగుంటే కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. ఎవెంజర్స్, అవతార్ 2 లాంటి చిత్రాలు ఇండియా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేశాయో చూశాం.
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. మిషన్ ఇంపాజిబుల్ 6 వచ్చిన ఐదేళ్ల తర్వాత ఈ సిరీస్ నుంచి 7వ భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. నిన్న రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ జాతర మొదలు పెట్టింది.
వర్కింగ్ డే రోజున ఈ చిత్రం ఇండియాలో రిలీజైనప్పటికీ ఏకంగా 12.5 కోట్లకి పైగా నెట్ వసూలు చేసి ట్రేడ్ విశ్లేషకులని ఆశ్చర్యంలో ముంచెత్తింది. లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి వీకెండ్ ముగిసే సరికి ఈ చిత్రం 50 కోట్ల నెట్ అందుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సిరీస్ లో వచ్చిన 7 భాగాన్ని.. మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకొనింగ్ పార్ట్ 1 గా రిలీజ్ చేశారు. అంటే ఇందులో రెండవ భాగం కూడా ఉంది.

వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఇండియన్ కరెన్సీలో దాదాపు 1900 కోట్ల వసూళ్ళని తొలిరోజే సాధించినట్లు తెలుస్తోంది. అబ్బుర పరిచేలా ఉండే యాక్షన్ ఘట్టాలు, టామ్ క్రూజ్ చేసిన రిస్కీ స్టంట్స్ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలేవీ లేకపోవడంతో యాక్షన్ ప్రియులకు మిషన్ ఇంపాజిబుల్ 7 బెస్ట్ ఆప్షన్ గా మారినట్లు తెలుస్తోంది.
