Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి - మహేష్ బాబు కాంబినేషన్ లో మిస్ అయిన సినిమాలు..? కారణం ఇదే..?

మెగాస్టార్ - సూపర్ స్టార్ కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ కు పండగే.. కాని ఈ కాంబోలో రెండు  సినిమాలు మిస్ అయ్యాయని మీకు తెలుసా..? అవును ఇంతకీ విషయం ఏంటంటే...? 
 

Missed Opportunities: Why Chiranjeevi and Mahesh Babu Combination Films Never Happened JmS
Author
First Published Aug 24, 2024, 8:47 PM IST | Last Updated Aug 24, 2024, 8:47 PM IST

మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఇద్దరు హీరోలకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ ను టచ్ చేయబోతున్నాడు.. అది వేరే విషయం.. అయితే ఈ ఇద్దరు హీరోల ఇమేజ్ లతో ఒ సినిమా బయటకు వస్తే.. ఎలా ఉంటుంది. ఆ సినిమా ఎంత సక్సెస్ సాధిస్తుంది..? ఆక్రేజ్ ఎక్కడివరకూ వెళ్తుంది.. కాని ఇద్దరు సినిమాలు దగ్గరగా వచ్చి మిస్ అయ్యాయని మీకు తెలుసా..? 

అవును ఈ ఇద్దరు హీరోలు గతంతో విడివిడిగా మల్టీ స్టారర్ మూవీస్ చేసినవారు. ఇక మహేష్ బాబు అయితే వెంకటేష్ తో కలిసి చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తెలుగువారి మనసుల్లో ఎలాంటి ముద్ర వేసుకుందో తెలిసిందే. అయితే ఈ ఇద్దరు స్టార్స్ తో మల్టీ స్టారర్ సినిమా రెండు సార్లు మిస్ అయ్యింది. ఒక సారి నిర్మాత సుబ్బిరామిరెడ్డి మెగా హీరోలు అయిన చిరు- పవన్ లతో మల్టీ స్టారర్ చేయాలి అనుకున్నాడట. కాని అది కుదరకపోవడంతో.. వవన్ స్థానంలో మహేష్ బాబును తీసుకుని చేయాలి అనుకున్నాడట. 

దర్శకుడిగా త్రివిక్రమ్ ను తీసుకోవాలి అని కథ ఆయన చేతుల్లో పెట్టారట. కాని కథ విషయంలో గురి కుదరక త్రివిక్రమ్ ఈమూవీని తరువాత చేద్దామని సలహా ఇచ్చారట కూడా. దాంతో ఈ సినిమా అలా అలానే మరుగున పడిపోయింది. ముందు ముందు ఈ కథ బయటకు వచ్చి.. ఈ ఇద్దరు కాంబో వస్తున్నందన నమ్మకం లేదు. 

ఇక రెండో సారి రీసెంట్ గా వీరి కాంబోలో సినిమా మిస్ అయ్యింది. చిరంజీవి హీరోగా కొరటా శివ డైరెక్ట్ చేసిన డిజాస్టర్ మూవీ ఆచార్యాలో.. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈసినిమాలో చరణ్ పాత్ర కోసం ముందు మహేష్ బాబును అనుకున్నాడట కొరటాల. కథ కూడా వినిపించాడట. కొరటాల తనను ప్లాప్ ల నుంచి రెండు సార్లు బయట పడేయడంతో.. ఆయన మీద గౌరవం ప్లస్ కథ కూడా నచ్చడంతో ఈ పాత్రకు మహేష్ ఒప్పుకున్నాడట కూడా. 

కాని ఈ సినిమాలో ఆచార్యగా చిరంజీవి.. సిద్ద పాత్ర కోసం రామ్ చరణ్ కావాలని మెగాస్టార్ పట్టుబట్టి రామ్ చరణ్ తో ఈ పాత్ర చేయించారట. అంతే కాదు ఆ టైమ్ లో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ బిజీలో ఉండగా.. రాజమౌళిని బ్రతిమలాడి మరీ డేట్స్ తీసుకున్నాడ చిరు. ఈ విషయంలో చరణ్ పై జక్కన్న కొప్పడ్డారని.. వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని కూడా టాక్ నడిచింది.   అయితే ఎలాగో అలా చరణ్ డేట్స్ తీసుకుని ఈసినిమా పూర్తి చేశారు. 

అలా ఆచార్య ను కూడా మహేష్ మిస్ అయ్యాడని టాలీవుడ్ టాక్. ఇక రెండు సార్లు ఇలా వీరి కాంబో మిస్ అయ్యిందట. ముందు ముందు కూడా వీరి కాంబినేషన్ కనిపించే అవకాశం లేదు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమాకోసం రెడీ అవుతుండగా.. మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈమూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios