టాలీవుడ్‌ స్వీటీ అనుష్క హీరోయిన్‌గా నటించడంతో `మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`పై అందరిలోనూ అటెన్షన్‌ నెలకొంది. అయితే `ఏజెంట్ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ`, `జాతిరత్నాలు` వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్ల తర్వాత నవీన్‌ పొలిశెట్టి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. 

చాలా గ్యాప్‌తో అనుష్క నటిస్తున్న చిత్రం `మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`. ఇందులో `జాతిరత్నాలు` ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటిస్తుండటం ఓ విశేషమైతే, అనుష్కకి జోడీగా నటిస్తుండటం మరో విశేషం. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. నూతన దర్శకుడు మహేష్‌బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న రిలీజ్‌ కాబోతుంది. షారూఖ్‌ నటిస్తున్న `జవాన్‌`తోపాటు ఈ చిత్రం కూడా విడుదల కాబోతుంది. 

టాలీవుడ్‌ స్వీటీ అనుష్క హీరోయిన్‌గా నటించడంతో దీనిపై అందరిలోనూ అటెన్షన్‌ నెలకొంది. అయితే `ఏజెంట్ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ`, `జాతిరత్నాలు` వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్ల తర్వాత నవీన్‌ పొలిశెట్టి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. కామెడీకి ఢోకా లేదని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లోనూ ఆ విషయం స్పష్టమైంది. అయితే ట్రైలర్ లో చూపించిన దానికంటే ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలో ఉంటుందట. దీంతోపాటు ట్రైలర్‌లో చూపించని మరో అంశం ఇందులో ఉంటుందట, అది సినిమాలో చూసి సర్‌ప్రైజ్‌ అవ్వాల్సిందే అని దర్శకుడు మహేష్‌ బాబు పి ఇటీవల ట్రైలర్‌ ఈవెంట్‌లో తెలిపారు. 

దీంతో `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంలో ఇంకా ఏం ఉండోబోతున్నాయనేది ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదలకు లైన్‌ క్లీయర్‌ అయ్యింది. సెన్సార్‌ రిపోర్ట్ వచ్చింది. ఈ సినిమాకి క్లీన్‌ `యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఐదేళ్ల లోపు పిల్లలు కాకుండా టీనేజ్‌ నుంచి పెద్ద వాళ్లందరూ ఈ సినిమా చూడొచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్స్ ని ఎంజాయ్‌ చేయోచ్చు అని చెబుతోంది ఈ సెన్సార్‌ రిపోర్ట్. ఇక సినిమా నిడివి డిటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ చిత్రం రెండున్నర గంటలు(151నిమిషాలు) ఉంటుందట. ఇటీవల వస్తున్న చాలా సినిమాల కంటే కాస్త తక్కువే ఉంది. 

రొమాంటిక్‌, ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. చాలా రిచ్‌గా సినిమాని తెరకెక్కించారు. కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్‌ 7న తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడలో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ బాధ్యతలు హీరో నవీన్‌ పొలిశెట్టి తన భుజాలపై వేసుకున్నారు. అనుష్క బయటకు రాకపోవడంతో తనే చేయాల్సి వస్తుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్నాడు. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరులో పర్యటించారు. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇ్పటికే ఇంకా టూర్‌ని కంటిన్యూ చేస్తున్నారు. 

అనుష్క బరువుకి సంబంధించిన సమస్యతో బాధపడుతుంది. అందుకే బయటకు రాలేకపోతుంది. ఈ నేపథ్యంలో నవీన్‌ పొలిశెట్టి ఒక్కడే `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` ప్రమోషన్స్ బాధ్యతలు తీసుకున్నారు. తనదైన స్టయిల్లో ప్రమోట్‌ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అనుష్క, నవీన్‌ పొలిశెట్టితోపాటు అభినవ్‌ గోమటం, మురళీ శర్మ, తులసి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.