`మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం కామెడీ ప్రధానంగా ఈ ట్రైలర్ సాగింది. ఇందులో నవీన్, అనుష్కలు చేసిన రచ్చ హైలైట్‌గా నిలిచింది.
అనుష్క, నవీన్ పొలిశెట్టి కలిసి `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రంలో నటిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. టాప్ హీరోయిన్ అనుష్క, కుర్ర హీరో నవీన్ పొలిశెల్లి హీరోగా కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. పాటలు సైతం అలరించాయి.
తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం కామెడీ ప్రధానంగా ఈ ట్రైలర్ సాగింది. నవీన్ పొలిశెట్టి అల్లరి, అనుష్క ప్రేమ కోసం ఆయన పడే పాట్లు, ఇన్నోసెంట్ యాక్టింగ్‌తో చేసే ఫన్ ఆద్యంతం అలరిస్తుంది. `స్టాండప్ కమెడియన్ కావాలంటే ఇంజనీరింగ్ చేయాలా అని అనుష్క అడగడం, చెఫ్ కావాలంటే ఇంజనీరింగ్ చేయలేదా? అని నవీన్ అడగడం, ఆ తర్వాత అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే అందంగా, పొడువుగా ఉండాలని, అదే అబ్బాయిలకు పెళ్లి కావాలంటే అమ్మాయి అయితే సరిపోతుందని నవీన్ చెప్పే డైలాగులు, దీంతోపాటు పిల్లలు కనాలంటే ప్రెగ్నెంట్ అయితే సరిపోతుందని, పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అనుష్క చెప్పడం, ఆ తర్వాత ప్రెగ్నెంట్ కావడం కోసం నవీన్ వెంటపడటం ఈ క్రమంలో ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయించేలా ఉన్నాయి.
ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. మినిమమ్ గ్యారంటీ అనే ఫీలింగ్‌ని తీసుకొస్తుంది. ఇటీవల యాక్షన్ మూవీస్, థ్రిల్లర్స్, కామెడీ ఎంటర్‌టైనర్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. విజయాలు సాధిస్తున్నాయి. `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకునే సినిమా అవుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పైగా చాలా రోజులు తర్వాత అనుష్క శెట్టి నటిస్తున్న సినిమా కావడంతో ఒకింత ఆసక్తి ఏర్పడింది.
దీనికితోడు `జాతిరత్నాలు` వంటి కామెడీ బ్లాక్ బస్టర్ తర్వాత నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తోన్న మూవీ కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇక పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదల కాబోతుంది. సెప్టెంబర్ 7న సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. మరి ఏ రేంజ్‌లో అలరిస్తారో చూడాలి.
