అఫీషియల్ :‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’OTT రిలీజ్ డేట్
అనుష్కా శెట్టి, నవీన్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.

రీసెంట్ గా క్లాస్ ప్రేక్షకులకు బాగా నచ్చిన చిత్రం ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’. అనుష్క, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో పి.మహేశ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాథించింది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదట్లో జస్ట్ ఓకే టాక్ వచ్చింది. ఆ తర్వాత అనుష్క నటన, నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ జనాల్లోకి వెళ్లటంతో సినిమాను సక్సెస్ వైపుకు తీసుకెళ్లాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబరు 5వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. (Miss Shetty Mr Polishetty ott relase date) ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ పోస్టర్‌ను షేర్ చేసింది.
నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.....నా తొలి చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నేను బాగా నటించగలనని నిరూపించింది. నా సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం ‘జాతి రత్నాలు’ చిత్రంతో ప్రొడ్యూసర్స్, బయ్యర్స్‌లో వచ్చింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో నేను కేవలం కామెడీ మాత్రమే కాదు.. భావోద్వేగాలు కూడా పండించగలను అని నిరూపించుకున్నా అన్నారు.
అలాగే మంచి సినిమా చేశాం.. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉండేది. అది నిజమైంది. తెలుగులో వసూళ్లు నెమ్మదిగా మొదలైనా ఆ తర్వాత పుంజుకున్నాయి.. మూడో వారంలోనూ మంచి వసూళ్లు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు.
కామెడీ, ఎమోషన్స్ కలగలిపి తీసిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా తొలి రోజు కలెక్షన్స్ మాత్రం పేలవంగా వచ్చాయి. అదేరోజు రిలీజైన బాలీవుడ్ మూవీ జవాన్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్ల మేర వసూళ్లు రాబట్టి రికార్డుల వేటకు సిద్ధమని సమరశంఖం పూరించింది. జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలు ఒకేరోజు రిలీజవడం నవీన్-అనుష్కల సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. జవాన్‌కు హిట్ టాక్ రావడంతో థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. మెల్లిగా జవాన్ పోటీని తట్టుకుని మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకుంది.