మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. మహానటి తరువాత కీర్తి నటిస్తున్న డైరెక్ట్ సోలో తెలుగు సినిమా మిస్ ఇండియా. సినిమా టీజర్ ని ఎట్టకేలకు చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమాలో కీర్తి సరికొత్తగా కనిపించనుందని తెలుస్తోంది. 

గ్లామర్ డోస్ ఎక్కువకాకుండా ఫుల్ స్టైలిష్ గా కనిపిస్తున్న కీర్తి పాత్ర సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉండనుందట. ఇక టీజర్ లో విజువల్స్ లొకేషన్స్ అందంగా కనిపిస్తున్నాయి. థమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మిస్ ఇండియా సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. ఇక నరేంద్ర నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.