తెలుగులో హీరోయిన్ గా ఒకట్రెండు సినిమాలు చేసిన మిష్టి చక్రవర్తి 'మణికర్ణిక' సినిమాలో కాశీబాయి పాత్రలో నటించింది. ఈ సినిమాకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

డైరెక్టర్ క్రెడిట్ విషయంలో అటు కంగనా, ఇటు క్రిష్ ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు. ఈ విషయంలో కొందరు కంగనాకి సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు క్రిష్ కి తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఇది ఇలా ఉండగా సినిమాలో తన పాత్ర గురించి మిష్టి చక్రవర్తి తాజాగా మీడియా ముందు మాట్లాడారు. 

సినిమాలో కంగనా తన పాత్ర నిడివి తగ్గించిన విధానం చూసిన బాధపడినట్లు వెల్లడించింది. క్రిష్ ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి అని ఆయనతో కలిసి పని చేయాలని ఎప్పుడూ అనుకునేదాన్ని అంటూ ఆ అవకాశం 'మణికర్ణిక'తో రావడం సంతోషంగా భావించానని అందుకే సినిమా ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది.

కానీ సినిమా చూసిన తరువాత చాలా బాధపడినట్లు స్పష్టం చేసింది. క్రిష్ తన పాత్రకు ఇచ్చిన నిడివి, ప్రాధాన్యత సినిమాలో కనిపించలేదని కంగనా తన పాత్రను క్యారికేచర్ లా మార్చేశారని వెల్లడించింది. కంగనాకు డైరెక్టర్ కు ఉండాల్సిన లక్షణాలు లేవని తెలిపింది.

డైరెక్టర్ ఎవరైనా సినిమాలో అన్ని పాత్రలను సమానంగా ప్రేమిస్తారు కానీ కంగనామాత్రం తన పాత్రను మాత్రమే ప్రేమించిమిగిలిన పాత్రలను పట్టించుకోదని కామెంట్స్ చేసింది.